టీ20 క్రికెట్‌లో సునామీ.. 10 సిక్సర్లు.. 26 బంతుల్లో 124 పరుగులు.. మాజీ ఆర్సీబీ ప్లేయర్ విధ్వంసం!

టీ20 క్రికెట్‌లో బాస్ ఎవరంటే.. ఖచ్చితంగా అందరూ కూడా వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌ అని చెబుతారు. అయితే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో..

టీ20 క్రికెట్‌లో సునామీ.. 10 సిక్సర్లు.. 26 బంతుల్లో 124 పరుగులు.. మాజీ ఆర్సీబీ ప్లేయర్ విధ్వంసం!
Ex Rcb Player
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jul 03, 2021 | 7:34 PM

టీ20 క్రికెట్‌లో బాస్ ఎవరంటే.. ఖచ్చితంగా అందరూ కూడా వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌ అని చెబుతారు. అయితే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఏ బ్యాట్స్‌మన్‌ అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేశారని అడిగితే.. దానికి ఆన్సర్ ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్. 2018వ సంవత్సరం జూలై 3న ఫించ్ ఈ ఘనత సాధించాడు. జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆరోన్ ఫించ్ 76 బంతుల్లో 172 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో కేవలం 26 బంతుల్లో ఫోర్లు, సిక్సర్ల సహాయంతో 124 పరుగులు సాధించాడు.

3 జూలై 2018న హరారే వేదికగా జింబాబ్వే, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆసీస్ మొదట బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ విధ్వంసం సృష్టించాడు. 76 బంతులు 172 పరుగుల భారీ స్కోర్ సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. ఇక మరో ఓపెనర్ షార్ట్ 46 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 223 పరుగులు జోడించారు. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఘోర ఓటమిపాలైంది.

క్రిస్ గేల్‌కు 175 పరుగులు…

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఫించ్ తర్వాత రెండవ అత్యధిక స్కోరు సాధించింది ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్‌మన్ హజ్రతుల్లా జజాయ్. అతడు 2019 సంవత్సరంలో ఐర్లాండ్‌పై 62 బంతుల్లో 162 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక మూడో ప్లేస్‌లో కూడా ఫించే ఉండటం విశేషం. 2013లో ఇంగ్లాండ్‌పై 63 బంతుల్లో 156 పరుగులు చేసిన ఫించ్ మూడో స్థానాన్ని కూడా కైవసం చేసుకున్నాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున క్రిస్ గేల్ 175 పరుగుల చేసి టీ20 క్రికెట్‌లో అత్యధిక స్కోర్‌ను తన పేరిట నమోదు చేసుకున్నాడు.

Also Read: రోజూ ఎన్ని బాదంపప్పులు తినాలి.? అతిగా తింటే ఏమవుతుంది.! ఈ విషయాలు తెలుసుకోండి

వామ్మో.. మొసలితో ఆ పిచ్చి గేమ్స్‌ ఏంటి అమ్మాయి.? వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

ఈ ఫ్యాన్సీ నెంబర్‌కు క్రేజ్ మాములుగా లేదు.. ఏకంగా రూ. 7.6 లక్షలకు అమ్ముడైంది.!

తెలుగు వార్తలు లైవ్ ఇక్కడ చూడండి