Euro Cup 2020: యూరో కప్‌లో డెన్మార్క్‌ సంచలనం.. 29 ఏళ్ల తరువాత మొదటి సారి.!

యూరో కప్ లో కొన్ని జట్లు రికార్డులుకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్నాయి. తాజాగా డెన్మార్క్‌ టీం సంచలనం సృష్టించింది.

Euro Cup 2020: యూరో కప్‌లో డెన్మార్క్‌ సంచలనం.. 29 ఏళ్ల తరువాత మొదటి సారి.!
Denmark
Follow us

|

Updated on: Jul 04, 2021 | 3:15 PM

Euro Cup 2021: యూరో కప్ లో కొన్ని జట్లు రికార్డులుకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్నాయి. తాజాగా డెన్మార్క్‌ టీం సంచలనం సృష్టించింది. 29 ఏళ్ల తరువాత ఆ జట్టు యూరో కప్ సెమీ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. చెక్ రిపబ్లిక్ తో శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 2- 1 తేడాతో డెన్మార్క్ విజయం సాధించింది. 1992లో డెన్మార్క్ టీం చివరిసారిగా సెమీ ఫైనల్స్ కు చేరుకుంది. ఆ సంవత్సరం యూరో కప్ విజేతగాను నిలిచింది. ఇన్నాళ్ల యూరో కప్ చరిత్రలో డెన్మార్క్‌ సాధించిన ఏకైక టైటిల్ కూడా అదే. ఇక తాజాగా జరిగిన క్వార్టర్ ఫైనల్ లో ఆ జట్టు తరపున డెలానీ (5వ నిమిషంలో), డాల్‌బెర్గ్‌ (42వ నిమిషయంలో) ఒక్కో గోల్‌ కొట్టి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక చెక్‌ రిపబ్లిక్‌ టీం తరపున షిక్‌ (49వ నిమిషంలో) ఒక్కడే గోల్‌ సాధించాడు.

శనివారం జరిగిన ఈ మ్యాచ్ లో డెన్మార్క్ టీం మొదటి నుంచి ఆధిపత్యం కొనసాగింది. థామస్ డెలానీ 5 వ నిముషంలో మొదటి గోల్ చేశాడు. అనంతరం డాల్ బెర్గ్ 42 వ నిముషంలో రెండో గోల్ చేయడంతో డెన్మార్క్ టీం 2-0తో చెక్ రిపబ్లిక్ టీంపై గెలుపు దిశగా దూసుకపోతోంది. కానీ, ఆట రెండో భాగంలో చెక్ రిపబ్లిక్ ఆటగాడు ప్యాట్రిక్ షిక్ 49వ నిముషంలో గోల్ చేయడంతో స్కోర్ సమం అవుతుదనుకున్నారు అంతా. కానీ, చెక్ రిపబ్లిక్ టీం విఫలమవడంతో.. 29 ఏళ్ల డెన్మార్క్ కల నెరవేరింది.

మరో క్వార్టర్ ఫైనల్లో ఇటలీ టీం 2–1తో బెల్జియంపై గెలిచి, సెమీఫైనల్‌ చేరింది. ఈ మ్యాచ్ లో కూడా ఇటలీ టీం పూర్తి దూకుడు ప్రదర్శించి బెల్జియంపై విజయం సాధించింది. 2-1 తేడాతో బెల్జియంపై గెలిచి, సెమీఫైనల్స్ కు దూసుకెళ్లింది. బుధవారం జరిగే సెమీ ఫైనల్స్ లో ఇటలీ జట్టు స్పెయిన్ తో పోరాడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు.. ఫైనల్ చేరకుటుంది. అలాగే గురువారం జరిగే మరో సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్ జట్టు డెన్మార్క్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ 12న (సోమవారం) జరగనుంది.

Also Read:

Smriti Mandhana: స్టన్నింగ్‌ క్యాచ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన స్మృతి మంధాన. ఆ అద్భుత క్యాచ్‌ను మీరూ చూసేయండి.

David Warner: ‘వినయ విధేయ వార్నర్‌’.. ఈ సారి రామ్‌చరణ్‌ను వాడేసిన వార్నర్‌. వైరల్‌గా మారిన వీడియో..

టోక్యో ఒలింపిక్స్‌ పోటీలకు స్విమ్మర్ గా ఎంపికై రికార్డ్ సృష్టించిన తొలి భారత మానా పటేల్ :Tokyo Olympics 2021.