Smriti Mandhana: స్టన్నింగ్‌ క్యాచ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన స్మృతి మంధాన. ఆ అద్భుత క్యాచ్‌ను మీరూ చూసేయండి.

Smriti Mandhana: సాధారణంగా అద్భుత ఫీల్డింగ్, కళ్లు చెదిరే క్యాచ్‌లు ఎక్కువగా మెన్‌ క్రికెట్‌లోనే కనిపిస్తుంటాయి. అయితే తామేమి తక్కువ కాదన్నట్లు నిరూపించింది టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న...

Smriti Mandhana: స్టన్నింగ్‌ క్యాచ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన స్మృతి మంధాన. ఆ అద్భుత క్యాచ్‌ను మీరూ చూసేయండి.
Smriti Mandhana
Follow us

|

Updated on: Jul 04, 2021 | 1:44 PM

Smriti Mandhana: సాధారణంగా అద్భుత ఫీల్డింగ్, కళ్లు చెదిరే క్యాచ్‌లు ఎక్కువగా మెన్‌ క్రికెట్‌లోనే కనిపిస్తుంటాయి. అయితే తామేమి తక్కువ కాదన్నట్లు నిరూపించింది టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న చివరి వన్డేలో ఓ అద్భుత క్యాచ్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించగా… స్మృతి పట్టుకున్న క్యాచ్‌ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. 49 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్న నాట్‌ స్కివర్‌ దీప్తి బౌలింగ్‌లో లాంగ్‌ షాట్‌ కోసం ప్రయత్నించింది. ఆ సమయంలో బౌండరీ లైన్‌ వద్ద ఉన్న స్మృతి వేగంగా పరిగెడుతూ వచ్చి గాల్లో డైవ్‌ చేసి మరీ క్యాచ్‌ను ఒడిసి పట్టుకుంది. ప్రస్తుతం స్మృతి క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో క్రికెట్ దిగ్గజాలు సైతం ఆమెపై ప్రశసంలు కురిపిస్తున్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ లీసా స్తాలేకర్‌.. ‘ఫ్లై స్మృతి ఫ్లై గ‌ర్ల్.. ఫెంటాస్టిక్ క్యాచ్‌’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇక అభిమానులు సైతం స్మృతిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అద్భుతమైన క్యాచ్‌, ఫెంటాస్టిక్‌ అంటూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. ఇక కేవలం ఫీల్డింగ్‌కే పరిమితం కాకుండా స్మృతి ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లోనూ రాణించారు. 57 బంతుల్లో 49 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్‌ జట్టు మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. మరి ఈ అద్భుతమైన క్యాచ్‌పై మీరూ ఓ లుక్కేయండి.

Also Read: Dhoni Son of Sachin : మహేంద్ర సింగ్ ధోని సన్నాఫ్ సచిన్ టెండుల్కర్..! ఛత్తీస్‌గడ్‌లో టీచర్ పోస్ట్ కోసం వింత దరఖాస్తు..

టీ20 క్రికెట్‌లో సునామీ.. 10 సిక్సర్లు.. 26 బంతుల్లో 124 పరుగులు.. మాజీ ఆర్సీబీ ప్లేయర్ విధ్వంసం!

బౌన్సర్ దాటికి మైదానంలో కుప్పకూలిన క్రికెటర్..! అతడి బర్త్‌ డే సందర్భంగా స్పెషల్ స్టోరీ..