- Telugu News Photo Gallery Cricket photos Mithali raj beats dhoni and virat kohli in highest batting average in successful odi runchases
Mithali Raj: మిథాలీ రాజ్ తరువాతే ధోనీ, విరాట్ కోహ్లీ.. ఏ రికార్డులోనో తెలుసా..?
Mithali Raj: ఇంగ్లండ్ తో జరిగిన మూడో వన్డేలో మిథాలీ రాజ్ హాఫ్ సెంచరీతో అజేయంగా నిలిచి, టీం మిండియాను విజయం వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ సిరీస్ లో మిథాలీ మూడు అర్థ సెంచరీలతో కదం తొక్కింది.
Updated on: Jul 05, 2021 | 10:34 AM

Mithali Raj: టీమిండియా క్రికెటర్లైన విరాట్ కోహ్లీ, మాజీ ప్లేయర్ ధోనీ, మిథాలీ రాజ్ లకు చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. ఈ ముగ్గురు చాలా కాలంగా టీమిండియాకు కెప్టెన్ లుగా వ్యవరించారు. అలాగే వన్డే ర్యాకింగ్స్ లోనూ వారి హయాంలో తొలి స్థానంలో నిలిచారు. తోటి కెప్టెన్ల కంటే ఎక్కు వ విజయాలు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఇక వన్డేల్లో చేజింగ్స్ విషయానికి వస్తే.. విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ధోనీలు మిథాలీ రాజ్ కంటే వెనుకంజలోనే ఉన్నారు.

ఇంగ్లండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో మిథాలీ రాజ్ మూడు అర్థ శతకాలను నమోదు చేసింది. అలాగే ఈ సిరీస్ లో అత్యధిక పరుగుల జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. మహిళల క్రికెట్ లో ఛేజింగ్ లో 50 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్లను 18 సార్లు నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచింది.

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఫినిషర్ పాత్రను చాలా మ్యాచ్ ల్లో పోషించాడు. ఛేజింగ్ లో ధోనీ 102.71 సగటుతో 2876 పరుగులు సాధించాడు. పరుగులు ఎక్కువ సాధించినా.. సగటులో మాత్రం మిథాలీ కంటే వెనుకంజలోనే ఉండిపోయాడు.

పరుగుల యంత్రంలా మారిన ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ విషయంలో మూడో స్థానంలో నిలిచాడు. ఛేజింగ్ లో 96.21 సగటుతో 5388 పరుగులు సాధించాడు.

మిథాలీ రాజ్ ఛేజింగ్ లో అత్యధిక సగటును సాధించి చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్ తో జరిగిన మూడో వన్డేలో మిథాలీ రాజ్ 75 పరుగులతో అజేయంగా నిలిచి, టీమిండియాను 4 వికెట్ల తేడాతో గెలిపించింది. దీంతో ఛేజింగ్ లో మిథాలీ రాజ్ సగటు 111.1 కి చేరుకుంది. ఇది ప్రపంచ క్రికెట్ లోనే అత్యధికంగా ఉంది. ఛేజింగ్ లో మిథాలీ 2111 పరుగులు సాధించింది.




