AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో ఆడే 11 మంది టీమిండియా ప్లేయర్లు వీరే.. లంక, కివీస్‌లపై వరుస విజయాలతో ఫిక్స్..

India World Cup 2023 Playing XI: వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్‌ను 3-0 తేడాతో ఓడించిన టీమ్ ఇండియా.. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్-1గా నిలిచింది. దీంతో వన్డే ప్రపంచకప్‌నకు సన్నాహాల్లో నిమగ్నమైన భారత జట్టు.. ఇదే దూకుడిగా ముందుకు సాగాలని కోరుకుంటోంది.

ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో ఆడే 11 మంది టీమిండియా ప్లేయర్లు వీరే.. లంక, కివీస్‌లపై వరుస విజయాలతో ఫిక్స్..
Team India
Venkata Chari
|

Updated on: Jan 26, 2023 | 6:58 AM

Share

భారత జట్టు ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో వన్డే ప్రపంచకప్‌ ఆడాల్సి ఉంది. ఈ టోర్నీ భారత్‌లో జరగనుంది. గత 10 సంవత్సరాలుగా ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న భారత జట్టు ఈ ప్రపంచకప్‌పై కన్నేసింది. భారత జట్టు ఇప్పటికే సన్నాహాల్లో బిజీగా ఉంది. ఇటీవల శ్రీలంక, న్యూజిలాండ్‌లతో జరిగిన వన్డే సిరీస్‌లలో కూడా దాని ప్రభావం చూపడం ప్రారంభించింది. ఇప్పటి వరకు భారత జట్టు ప్రదర్శన తీరు, ఆటగాళ్ల ఆట తీరు చూస్తుంటే వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు ఏ జట్టుతో ముందుకెళ్లగలదనే సూచనలు కనిపిస్తున్నాయి.

టీ20 ప్రపంచ కప్ 2022 ఓటమి తరువాత, బీసీసీఐలో కలకలం రేగింది. అప్పటి నుంచి ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 కోసం సన్నాహాలు ప్రారంభించింది. ప్రపంచ కప్ కోసం 20 మంది ఆటగాళ్లతో కూడిన పూల్‌ను సిద్ధం చేస్తున్నామని, వారు ప్రపంచ కప్ ఆడటానికి బలమైన పోటీదారులు అని బీసీసీఐ పేర్కొంది.

వన్డే సిరీస్‌లో తరచూ బ్రేక్‌ తీసుకునే విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ వంటి సీనియర్‌ ఆటగాళ్లు కూడా ఇప్పుడు రెగ్యులర్‌ వన్డేల్లో దర్శనమివ్వడంతో టీమిండియా ఫోకస్‌ అంతా వన్డే ఫార్మాట్‌పైనే పడింది. 2023 సంవత్సరంలో ఇప్పటి వరకు ఆడిన 6 వన్డేలు, ఇతర ఆటగాళ్లను పరిశీలిస్తే టీమ్ ఇండియా ప్లేయింగ్-11 లేదా 15 మంది ఆటగాళ్ల జట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శనతో వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయబోతున్నాడని స్పష్టమవుతుంది. విరాట్ కోహ్లి 3వ నంబర్‌లో ఆడటం ఖాయం. శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌లు నాలుగు ఐదు స్థానాల్లో కనిపించనున్నారు.

టీ20ల్లో రాణిస్తోన్న సూర్యకుమార్ యాదవ్.. వన్డేలో విఫలమవుతున్నాడు. దీంతో ఆయన స్థానంలో ఇషాన్ కిషన్ ఆడే అవకాశం పొందవచ్చు. అదే సమయంలో, వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ కనిపించనున్నాడు. అయితే సూర్య-ఇషాన్, కేఎల్ రాహుల్‌లలో ఒకరికి మాత్రమే ప్లేయింగ్-11లో చోటు దక్కుతుంది.

బౌలింగ్, ఆల్ రౌండర్‌లో ఎవరికి అవకాశం?

హార్దిక్ పాండ్యా ఆడటం ఖాయం. ప్రస్తుతం నిరంతరంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు అతను వన్డే జట్టుకు వైస్ కెప్టెన్ అయ్యాడు. వీరితో పాటు, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా త్రయం ఫాస్ట్ బౌలింగ్‌పై ఆధారపడవచ్చు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్ వంటి ఎంపికలు కూడా టీమ్ ఇండియాకు ఉన్నాయి.

టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్

ఈ ఆటగాళ్లకు కూడా అవకాశం లభించే ఛాన్స్: యుజ్వేంద్ర చాహల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ (ఫిట్ అయితే), వాషింగ్టన్ సుందర్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..