IND vs NZ T20: రాంచీలో టీమిండియా రికార్డులు అదుర్స్.. మరోసారి కివీస్‌కు మొండిచెయ్యే.. టీ20 పోరుకు సిద్ధం..

India vs New Zealand 1st T20 Ranchi: టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ రాంచీలో జరగనుంది. ఇక్కడ 2021లో న్యూజిలాండ్‌పై టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

IND vs NZ T20: రాంచీలో టీమిండియా రికార్డులు అదుర్స్.. మరోసారి కివీస్‌కు మొండిచెయ్యే.. టీ20 పోరుకు సిద్ధం..
Ind Vs Nz T20i Series
Follow us

|

Updated on: Jan 26, 2023 | 7:20 AM

India vs New Zealand: వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్‌ను భారత్ ఘోరంగా ఓడించింది. 3-0తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. ఇప్పుడు ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ జరగనుంది. తొలి మ్యాచ్ శుక్రవారం రాంచీలో జరగనుంది. ఈ మ్యాచ్ రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో జరగనుంది. ఇక్కడ ఇప్పటివరకు టీమ్ ఇండియా రికార్డు అద్భుతంగా ఉంది. ఈ మైదానంలో టీమ్‌ఇండియా ఇప్పటివరకు ఒక్క టీ20 మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను కూడా ఓడించిన రికార్డ్ టీమిండియాకు ఉంది. ఇప్పుడు మరోసారి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో జనవరి 27న భారత జట్టు రంగంలోకి దిగనుంది.

రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో భారత్ టీ20 మ్యాచ్‌ల రికార్డును ఓసారి చూద్దాం.. ఇప్పటి వరకు ఇక్కడ టీ20 మ్యాచ్‌లో ఒక్క టీ20 కూడా ఓడిపోలేదు. 3 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. మూడింటిలోనూ గెలిచింది. 2016 ఫిబ్రవరిలో ఇక్కడ భారత్ 69 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఆ తర్వాత 2017 అక్టోబర్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 2021లో న్యూజిలాండ్‌పై టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అందుకే ఈసారి కూడా భారత జట్టు తన రికార్డును నిలబెట్టుకోవాలని భావిస్తోంది.

ఇప్పటివరకు రాంచీలో భారత్-న్యూజిలాండ్ మధ్య ఒకే ఒక్క టీ20 మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నవంబర్ 2021లో భారత్, న్యూజిలాండ్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 153 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా తరుపున కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ హాఫ్‌ సెంచరీలు చేశారు. రోహిత్ 36 బంతుల్లో 55 పరుగులు చేశారు.

ఇవి కూడా చదవండి

విశేషమేమిటంటే, వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ 12 పరుగుల తేడాతో, రెండో మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు జనవరి 27న టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత జనవరి 29, ఫిబ్రవరి 1 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. సిరీస్‌లో రెండో మ్యాచ్ లక్నోలో, మూడో మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో