Asia Cup Prize Money: టైటిల్ గెలిచిన భారత్‌పై కాసుల వర్షం.. రోహిత్ సేనకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
India vs Sri Lanka: ఆసియా కప్ చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై భారత జట్టు ఏకపక్షంగా 10 వికెట్ల తేడాతో విజయం సాధించి టైటిల్‌ను గెలుచుకుంది. కుల్దీప్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు లభించగా, 6 వికెట్లతో లంక నడ్డి విరిచిన మహ్మద్ సిరాజ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది.

Asia Cup 2023 Prize Money Full Details: ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకను 10 వికెట్ల తేడాతో ఓడించి భారత జట్టు 5 సంవత్సరాల తర్వాత ఈ టైటిల్‌ను దక్కించుకుంది. ఆసియా కప్ చరిత్రలో టీమిండియా ఎనిమిదోసారి ఈ ట్రోఫీని గెలుచుకుంది. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన టీమిండియాకు కూడా భారీ మొత్తంలో ప్రైజ్ మనీ లభించింది. ఆఖరి మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ బాల్‌తో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టును 50 పరుగులకే పరిమితం చేయడంలో మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు. ఈ లక్ష్యాన్ని భారత్ కేవలం 6.1 ఓవర్లలోనే సాధించింది. ఆ తర్వాత విజేతగా టీమిండియా 150,000 US డాలర్లను(రూ. 1 కోటీ 25 లక్షలు) ప్రైజ్ మనీగా అందుకుంది. రన్నరప్‌గా శ్రీలంక జట్టుకు ప్రైజ్ మనీగా US $ 75,000 (రూ. 62 లక్షలు)దక్కించుకుంది.
కుల్దీప్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ టైటిల్..
View this post on Instagram
2023 ఆసియా కప్‌లో భారత జట్టు బౌలర్ల అద్భుతమైన ప్రదర్శన కనిపించింది. ఇందులో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు, ఆ తర్వాత శ్రీలంకపై ముఖ్యమైన సమయాల్లో 4 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ టోర్నమెంట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు కుల్దీప్‌కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ టైటిల్ లభించింది. ఈమేరకు 15,000 US డాలర్ల (రూ. 12 లక్షలు) ప్రైస్ మనీ అందుకున్నాడు.
కుల్దీప్ అందుకున్న మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డ్..
View this post on Instagram
ఫైనల్ మ్యాచ్‌లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో మహ్మద్ సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ అవార్డుగా సిరాజ్ US $ 5,000(రూ.4.16 లక్షలు) మొత్తాన్ని అందుకున్నాడు. దానిని అతను గ్రౌండ్స్‌మన్‌కు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.
మహ్మద్ సిరాజ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్..
View this post on Instagram
శ్రీలంకపై విజయంతో ఆనందంలో ఆటగాళ్లు..
View this post on Instagram
ఇరుజట్ల ప్లేయింగ్ 11..
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్(కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




