IND vs AUS 3rd T20I: 13 ఫోర్లు, 7 సిక్సులతో తొలి సెంచరీ.. ఆసీస్ బౌలర్లపై రుతురాజ్ ఊచకోత
టీ20 సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు 223 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. గౌహతిలోని బర్సపరా స్టేడియంలో మంగళవారం టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 222 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో 30 పరుగులు వచ్చాయి.

మంగళవారం గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టీ20లో భారత ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తన తొలి అంతర్జాతీయ సెంచరీని సాధించాడు. సిక్స్‌తో ఈ సెంచరీ పూర్తి చేసి, ఆస్ట్రేలియా బౌలర్లను ఉతికారేశాడు. గైక్వాడ్ 2021లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరక ODIలు, T20Iలలో కలిపి 20 మ్యాచ్‌లు ఆడాడు. ఇంతకుముందు 71 పరుగులతో అత్యధిక స్కోర్‌ను కలిగి ఉన్నాడు. కానీ, నేడు ఈ స్కోర్‌ను దాటేసి, తొలి సెంచరీతో సత్తా చాటాడు. ఈ రైట్ హ్యాండర్ ఇప్పుడు T20 క్రికెట్‌లో ఐదు సెంచరీలను కలిగి ఉన్నాడు. ఇందులో 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఒకటి కూడా ఉంది. మహారాష్ట్ర తరపున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 20 ఓవర్ల దేశవాళీ టోర్నమెంట్‌లో గైక్వాడ్ మూడు సెంచరీలు సాధించాడు.
ఆస్ట్రేలియాకు 223 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. గౌహతిలోని బర్సపరా స్టేడియంలో మంగళవారం టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 222 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో 30 పరుగులు వచ్చాయి.
ఇరు జట్లు:
భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(కీపర్/కెప్టెన్), నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘా, కేన్ రిచర్డ్‌సన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




