AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: టార్గెట్ టీ20 ప్రపంచకప్.. కీలక కోచ్‌కు మరోసారి ఛాన్సిచ్చిన బీసీసీఐ.. ఎవరంటే?

Paddy Upton Team India: 2011 ప్రపంచ కప్ ఛాంపియన్స్ భారత జట్టు సహాయక సిబ్బందిలో భాగమైన ఇతను, పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరిగే మూడో ODIకి ముందు జట్టుతో చేరాడు.

Team India: టార్గెట్ టీ20 ప్రపంచకప్.. కీలక కోచ్‌కు మరోసారి ఛాన్సిచ్చిన బీసీసీఐ.. ఎవరంటే?
Paddy Upton Mental Conditioning Coach Team India
Venkata Chari
|

Updated on: Jul 28, 2022 | 8:34 AM

Share

Paddy Upton Mental Conditioning Coach Team India: టీ20 ప్రపంచకప్‌పై కన్నేసిన బీసీసీఐ.. అందుకు తగ్గట్టుగానే ప్లాన్ చేస్తోంది. ఈమేరకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ మరోసారి భారత క్రికెట్ జట్టుతో భాగస్వామ్యం అయ్యాడు. భారత జట్టుకు మెంటల్ కండిషింగ్ కోచ్‌గా జాయిన్ అయ్యాడు. ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ వరకు అతడు టీమ్ ఇండియాతో కలిసి ఉండనున్నాడు. దీనిపై ప్యాడీ అప్టన్‌ స్పందిస్తూ.. కొత్త బాధ్యతపై చాలా ఎగ్జైట్‌గా ఉన్నానని చెప్పుకొచ్చాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్ గురించి కూడా ప్యాడీ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. 2011 ప్రపంచ కప్ ఛాంపియన్స్ భారత జట్టు సహాయక సిబ్బందిలో భాగమైన అప్టన్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరిగే మూడో ODIకి ముందు జట్టుతో చేరాడు. ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ వరకు భారత జట్టులో సభ్యుడిగా ఉండనున్నట్లు బీసీసీఐ పేర్కొంది.

అప్టన్ ట్వీట్ చేస్తూ, “భారత జట్టులోకి తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది. నా చిరకాల భాగస్వామి, నా స్నేహితుడు, టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి పని చేస్తున్నందుకు ఆనందిస్తు్న్నాను. ఇదొక గౌరవంగా భావిస్తున్నాను. రాజస్థాన్ రాయల్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

2008లో సీనియర్ జాతీయ జట్టుకు బాధ్యతలు స్వీకరించినప్పుడు, మాజీ ప్రధాన కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ ద్వారా అప్టన్ మొదటిసారిగా భారత జట్టుతో సంబంధం కలిగి ఉన్నాడు. వీరిద్దరూ 2011 వరకు విజయవంతమైన జోడీగా నిలిచారు. ఆ తర్వాత ఆప్టన్ వివిధ IPL జట్లతో అనుబంధం కలిగి ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్‌ ఫ్రాంచైజీలో ద్రవిడ్‌తో కలిసి ఆప్టన్ పనిచేశాడు.