AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

56 బంతులు.. 8 ఫోర్లు, 6 సిక్సర్లతో తుఫాన్ ఇన్నింగ్స్.. తొలి సెంచరీతో కోహ్లీ సహచరుడి బీభత్సం.. ఎవరో తెలుసా?

న్యూజిలాండ్ ఓపెనర్ 14 బంతుల్లో(8 ఫోర్లు, 6 సిక్సర్లు)నే బౌలర్లను చిత్తు చేశాడు. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు.

56 బంతులు.. 8 ఫోర్లు, 6 సిక్సర్లతో తుఫాన్ ఇన్నింగ్స్.. తొలి సెంచరీతో కోహ్లీ సహచరుడి బీభత్సం.. ఎవరో తెలుసా?
New Zealand Vs Scotland, Finn Allen
Venkata Chari
|

Updated on: Jul 28, 2022 | 9:30 AM

Share

విరాట్ కోహ్లీ భాగస్వామి మైదానంలో ప్రత్యర్థులకు సుస్సు పోయించాడు. న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌కు స్కాట్లాండ్‌ బౌలర్లు బలయ్యారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో భాగమైన ఫిన్ అలెన్ స్కాట్లాండ్ బౌలర్లను చిత్తు చేశాడు. కేవలం 14 బంతుల్లోనే ప్రత్యర్థి జట్టును చీల్చి చెండాడాడు. న్యూజిలాండ్, స్కాట్లాండ్ మధ్య బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఓపెనర్ అలెన్ 56 బంతుల్లో 101 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇది అతనికి తొలి సెంచరీ. అతని అద్భుతమైన ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు బాదేశాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 180.36గా నిలిచింది.

టీ20లో సెంచరీ చేసిన 5వ న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్..

ఇవి కూడా చదవండి

న్యూజిలాండ్ నుంచి టీ20 క్రికెట్‌లో సెంచరీ చేసిన 5వ ఆటగాడిగా అలెన్ నిలిచాడు. ఇంతకుముందు బ్రెండన్ మెకల్లమ్, కోలిన్ మున్రో, మార్టిన్ గప్టిల్, గ్లెన్ ఫిలిప్స్ కూడా టీ20ల్లో సెంచరీలు సాధించారు. అలెన్ ఈ ఇన్నింగ్స్ తర్వాత, IPL 2022లో అతనికి అవకాశం ఇవ్వకపోవడంతో RCB భాదపడుతున్నట్లు తెలుస్తోంది. IPL 2022 మెగా వేలంలో అలెన్‌ను RCB రూ. 80 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు.

మ్యాచ్ గురించి మాట్లాడితే, అలెన్ తుఫాన్ ఇన్నింగ్స్ కారణంగా ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లో 225 పరుగులు చేసింది. అలెన్‌తో పాటు మార్టిన్ గప్టిల్ 40 పరుగులు చేశాడు. 226 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన స్కాట్లాండ్ జట్టు నిర్ణీత ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇష్ సోధి 28 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. మిచెల్ సాంట్నర్ 2 వికెట్లు తీశాడు. స్కాట్లాండ్ తరపున మెక్‌లియోడ్ అత్యధికంగా 33 పరుగులు చేశాడు. స్కాట్లాండ్‌లో టీ20 క్రికెట్‌లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా ఫిన్ అలెన్ నిలిచాడు. అతనికి ముందు 2018లో అజేయంగా 89 పరుగులు చేసిన సర్ఫరాజ్ అహ్మద్ పేరిట ఇక్కడ అత్యుత్తమ స్కోరు రికార్డుగా నిలిచింది.