Team India Pacer: తనకు తాను బహుమతి అందించుకున్న టీమిండియా బౌలర్… కారులో షికారు…
ఆస్ట్రేలియా గడ్డపై అదరగొట్టిన టీమిండియా పేసర్, హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తనకు తాను బహుమతి అందించుకున్నాడు. చిన్ననాటి...
ఆస్ట్రేలియా గడ్డపై అదరగొట్టిన టీమిండియా పేసర్, హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తనకు తాను బహుమతి అందించుకున్నాడు. చిన్ననాటి నుంచి కోరుకున్న బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేసి హైదరాబాద్ రోడ్లపై షికారు చేశాడు. తన ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు. కాగా సిరాజ్ ఇటీవల టెస్టు సిరీస్‌లో సత్తా చాటాడు. భారత్ తరఫున టెస్టుల్లో ఆడాలనే తన తండ్రి కలను నిజం చేసుకున్న అతడు ఆస్ట్రేలియా గడ్డపై ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రదర్శన చేశాడు. గబ్బా టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడమే కాకుండా సిరీస్‌లో అత్యధికంగా 13 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు.
సిరాజ్ హైదరాబాద్‌కు రాగానే ఇంటికి వెళ్లలేదు. నేరుగా శ్మశానవాటికకు వెళ్లి… తన తండ్రి సమాధి వద్ద ప్రార్థనలు చేశాడు. ఆ తర్వాతే ఇంటికి చేరుకొని తన మాతృమూర్తిని కలిశాడు. అయితే ఈ హైదరాబాదీ పేసర్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన వారం రోజుల్లోనే తండ్రి మహ్మద్ గౌస్ అనారోగ్యంతో కన్నుమూశారు. టీమ్‌ఇండియాకు టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాలనే తన తండ్రి కోరికను నిజం చేసేందుకు అక్కడే ఉండిపోయాడు. దాంతో కడసారి చూపులకు కూడా నోచుకోలేకపోయాడు. కానీ ఆసీస్ సిరీస్‌లో రాణించాడు. అంతేకాకుండా పలుసార్లు జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినా సిరాజ్ ఏమాత్రం కుంగిపోలేదు.