India Vs England : క్రికెట్ ప్రియులను నిరాశపరిచిన బీసీసీఐ.. ప్రేక్షకులు లేకుండానే తొలి రెండు మ్యాచులు

చెన్నై వేదికగా ఫిబ్రవరిలో ఇంగ్లాండ్​తో జరగనున్న తొలి రెండు టెస్టులకు ప్రేక్షకులను అనుమతించడంలేదని తమిళనాడు క్రికెట్ సంఘం కార్యదర్శి రామస్వామి ప్రకటించారు. కోవిడ్ వైరస్..

India Vs England : క్రికెట్ ప్రియులను నిరాశపరిచిన బీసీసీఐ.. ప్రేక్షకులు లేకుండానే తొలి రెండు మ్యాచులు
Follow us
Sanjay Kasula

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 23, 2021 | 7:09 AM

Without Fans : స్వదేశంలో జరుగనున్న భారత్- ఇంగ్లాండ్ మ్యాచ్‌ను ప్రత్యేక్షంగా చూద్దామని అనుకుంటున్న ప్రేక్షకులకు నిరాశే మిగిల్చింది బీసీసీఐ నిర్ణయం.  తొలి రెండు టెస్టులకు ప్రేక్షకులను అనుమతించడం లేదు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో క్రికెటర్లు, ప్రేక్షకుల భద్రత దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

చెన్నై వేదికగా ఫిబ్రవరిలో ఇంగ్లాండ్​తో జరగనున్న తొలి రెండు టెస్టులకు ప్రేక్షకులను అనుమతించడంలేదని తమిళనాడు క్రికెట్ సంఘం కార్యదర్శి రామస్వామి ప్రకటించారు. కోవిడ్ వైరస్  తమిళనాడులో అధికంగా ఉండటం కూడా ఇందుకు కారణంగా భావిస్తున్నారు.

భారత్​లో ఇంగ్లాండ్​ పర్యటన ఫిబ్రవరి 5 నుంచి జరగనున్న తొలి టెస్టుతో మొదలు కానుంది. దీనితో పాటు ఫిబ్రవరి 13న మొదలయ్యే రెండో మ్యాచ్​ కూడా చెన్నైలోని ఎంఏ చిదంబరం మైదానం వేదికగా మారుతోంది.

కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో క్రికెటర్ల భద్రతపై ఎలాంటి రిస్క్​ తీసుకోదలచుకోవడం లేదని బీసీసీఐ అందులో స్పష్టం చేసింది. జనవరి 27 కల్లా ఇరు జట్లు చెన్నై చేరుకోనున్నాయి. క్రికెటర్లు బయోబబుల్​లోకి వెళ్లే ముందు కరోనా పరీక్షలు జరుపుతారు.