IPL 2021 auction : ఆటగాళ్లలో పోటుగాళ్లెవరు.. ఆక్షన్‌లో హైరేంజ్‌కి వెళ్లేదెవరు.. ఫిబ్రవరి 18న ఐపీఎల్ మినీ వేలం
IPL 14 auction : ఆటగాళ్లలో పోటుగాళ్లెవరు? ఎవరికెంత పలకబోతోంది? ఆక్షన్‌లో హైరేంజ్‌కి వెళ్లేదెవరు? బేరాల్లేక బావురుమనేదెవరు? వచ్చే సీజన్‌కోసం అప్పుడే మొదలైపోయింది ఐపీఎల్ రచ్చ. కరోనా కాలంలోనూ క్రేజ్ తగ్గని ఐపీఎల్ నెక్ట్స్ సీజన్‌కోసం అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. క్రికెట్ క్రేజ్‌ని ఓ రేంజ్‌కి తీసుకెళ్లింది ఇండియన్ ప్రీమియర్ లీగ్. వేర్వేరు దేశాల ప్లేయర్ల మల్టీ కాంబినేషన్‌తో… క్రికెట్‌కే కొత్త భాష్యాన్ని తీసుకొచ్చింది. సీజన్ సీజన్‌కీ సమ్‌థింగ్ స్పెషల్‌లా సాగుతున్న ఐపీఎల్‌లో.. వాట్ నెక్ట్స్ అనే […]
IPL 14 auction : ఆటగాళ్లలో పోటుగాళ్లెవరు? ఎవరికెంత పలకబోతోంది? ఆక్షన్‌లో హైరేంజ్‌కి వెళ్లేదెవరు? బేరాల్లేక బావురుమనేదెవరు? వచ్చే సీజన్‌కోసం అప్పుడే మొదలైపోయింది ఐపీఎల్ రచ్చ. కరోనా కాలంలోనూ క్రేజ్ తగ్గని ఐపీఎల్ నెక్ట్స్ సీజన్‌కోసం అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. క్రికెట్ క్రేజ్‌ని ఓ రేంజ్‌కి తీసుకెళ్లింది ఇండియన్ ప్రీమియర్ లీగ్. వేర్వేరు దేశాల ప్లేయర్ల మల్టీ కాంబినేషన్‌తో… క్రికెట్‌కే కొత్త భాష్యాన్ని తీసుకొచ్చింది. సీజన్ సీజన్‌కీ సమ్‌థింగ్ స్పెషల్‌లా సాగుతున్న ఐపీఎల్‌లో.. వాట్ నెక్ట్స్ అనే చర్చ అప్పుడే మొదలైంది. ఈ ఏడాది ఐపీఎల్ కోసం అప్పుడే కసరత్తు మొదలుపెట్టింది బీసీసీఐ. త్వరలోనే ఐపీఎల్ సీజన్ ఫోర్టీన్‌కి రోడ్ మ్యాప్ రెడీ కాబోతోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-14) 2021 సీజన్‌కు ముందే ఆటగాళ్ల వేలం నిర్వహించనుంది బీసీసీఐ. రాబోయే సీజన్‌కు సంబంధించిన ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 18న జరిగే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఈ ఏడాది ఐపీఎల్ భారత్‌లో జరుగుతుందా లేదా అనే విషయంపై బీసీసీఐ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. రాబోయే సీజన్‌ను స్వదేశంలో నిర్వహించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇప్పటికే తెలిపారు. కాగా సొంతగడ్డపై వచ్చే నెల నుంచి ఇంగ్లండ్‌తో భారత్ సిరీస్ సజావుగా జరిగితే స్వదేశంలోనే ఐపీఎల్ నిర్వహించడానికి మార్గం సుగమం అవుతుంది.
కరోనా దెబ్బకు ప్రేక్షకులు లేకుండానే సాగిపోయింది ఐపీఎల్ థర్టీన్. ఐపీఎల్ ఫోర్టీన్‌కి కూడా కరోనా సవాళ్లు తప్పేలా లేవు. అందుకే ముందస్తుగానే అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది బీసీసీఐ. వాస్తవానికి ఈ ఏడాదే మెగా వేలం జరుగుతుందని భావించినా… ఇది అనుకూల సమయం కాదని బీసీసీఐ భావించింది. అందుకే మెగా ఆక్షన్ బదులు మినీ వేలంతో సరిపెట్టాలని ఇటీవలే సమావేశమైన బీసీసీఐ పాలకమండలి నిర్ణయించింది. గత సీజన్‌కు యూఏఈ వేదికైంది. ఈసారి ఐపీఎల్ భారత్‌లోనే నిర్వహించే అవకాశాలున్నాయంటున్నారు. ఐపీఎల్ ఫోర్టీన్ ఎడిషన్‌లో మార్పులు అనూహ్యంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ఎనలిస్టులు.