Brad Hogg : కెప్టెన్ విరాట్ కోహ్లీ పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన ఆస్ట్రేలియన్ క్రికెటర్..
టీమిండియా కెప్టెన్ కోహ్లీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్‌హగ్. ఆసీస్‌పై విజయం సాధించిన తర్వాత రహానెకు సారథ్యం అప్పగించాలన్న వ్యాఖ్యలపై..
Brad Hogg : టీమిండియా కెప్టెన్ కోహ్లీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్‌హగ్. ఆసీస్‌పై విజయం సాధించిన తర్వాత రహానెకు సారథ్యం అప్పగించాలన్న వ్యాఖ్యలపై బ్రాడ్‌హగ్ స్పందించాడు. కెప్టెన్సీ నుంచి తొలగిస్తే విరాట్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందని వెల్లడించాడు. అలా చేయడం భారత సంస్కృతిని నాశనం చేస్తుందని పేర్కొన్నాడు. పితృత్వ సెలవుల్లో విరాట్ స్వదేశానికి తిరిగి వస్తే మూడు టెస్టులకు అజింక్య రహానె కెప్టెన్ గా బాధ్యతలు సవీకరించాడు. సీనియర్ బౌలర్లు గాయపడ్డా జట్టును చక్కగా ముందుకు నడిపించాడు. సమయోచితంగా మార్పులు చేస్తూ ఆకట్టుకున్నాడు. డ్రాగా ముగిస్తే చాలు అనుకున్న మ్యాచ్ ను విజయం తీరంపై చేర్చాడు. దాంతో అజింక్యకు సుదీర్ఘ ఫార్మాట్ బాధ్యతలు అప్పగించాలని వార్తలు, వాదనలు వినిపించాయి. దీనిపై బ్రాడ్‌హగ్ స్పందిస్తూ.. కెప్టెన్‌గా ఉంటే విరాట్ కోహ్లీ మెరుగ్గా బ్యాటింగ్ చేస్తాడు. అతడిని నాయకత్వ బాధ్యతల నుంచి తప్పిస్తే టీమ్‌ఇండియా సంస్కృతిని నాశనం చేసినట్టు అవుతుంది. అని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో బ్రాడ్‌హగ్ చెప్పుకొచ్చాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Tokyo Olympics: ఈసారి ఒలింపిక్స్ లేనట్లేనా.. క్రీడలను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోన్న జపాన్..?