Virat Kohli: ప్రేక్షకులకు అసభ్యకర సైగలు.. విరాట్ కోహ్లీపై జీవితకాలం నిషేధం.. కట్‌చేస్తే..

Virat Kohli: మైదానంలో ఆటతో పాటు, కోపానికి కూడా భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి పేరుగాంచాడు. మైదానంలో కోహ్లీ చాలా దూకుడుగా కనిపిస్తాడు. మైదానంలో ఆటగాళ్లతో కోహ్లీ తరచూ వాగ్వాదానికి దిగడం ఇప్పటికే ఎన్నో సార్లు చూశాం.

Virat Kohli: ప్రేక్షకులకు అసభ్యకర సైగలు.. విరాట్ కోహ్లీపై జీవితకాలం నిషేధం.. కట్‌చేస్తే..
Virat Kohli
Follow us

|

Updated on: Mar 26, 2023 | 5:50 AM

Virat Kohli: మైదానంలో ఆటతో పాటు, కోపానికి కూడా భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి పేరుగాంచాడు. మైదానంలో కోహ్లీ చాలా దూకుడుగా కనిపిస్తాడు. మైదానంలో ఆటగాళ్లతో కోహ్లీ తరచూ వాగ్వాదానికి దిగడం ఇప్పటికే ఎన్నో సార్లు చూశాం. అయితే, విరాట్ కెరీర్ ప్రారంభంలో, కోహ్లీ కోపంతో ఊగిపోయేవాడు. ఈ కోపంతో ఆయన ఓసారి నిషేధానికి గురయ్యే ప్రమాదంలో చిక్కుకున్నాడు. 2012లో ఆస్ట్రేలియా ప్రేక్షకులకు కోహ్లి మిడిల్ ఫింగర్ చూపించడంతో వివాదంలో చిక్కుకున్నాడు.

2012లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ప్రేక్షకులకు మిడిల్ ఫింగర్ చూపించాడు. ఈ చర్య తర్వాత, మ్యాచ్ రిఫరీ అతనిని నిషేధించేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని కోహ్లి స్వయంగా వెల్లడించాడు. మిడిల్ ఫింగర్ చూపించిన తర్వాత ఏం జరిగిందో ‘గ్రాహం బెన్‌సింగర్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ఈ విషయంపై కోహ్లీ మాట్లాడుతూ, “సిడ్నీలో (2012) చాలా మంది ఆస్ట్రేలియన్ ప్రేక్షకులు మ్యాచ్ చూసేందుకు వచ్చారు. నేను వారికి మధ్య వేలు చూపించాను. నేను చాలా కూల్‌గా ఉన్నాను. మ్యాచ్ రిఫరీ (రంజన్ మదుగల్లె) మరుసటి రోజు నన్ను తన ఆఫీసుకి పిలిచాడు. ఎందుకు పిలిచారంటూ అడిగాను. మ్యాచ్ రిఫరీ మాట్లాడుతూ “నిన్న బౌండరీ లైన్ వద్ద ఏమి జరిగింది?” అంటూ ప్రశ్నించాడు. “ఏమీ లేదు” అని సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత వార్తాపత్రికను నా ముందు పెట్టాడు. అందులో మొదటి పేజీలో మిడిల్ పింగర్‌తో ఉన్న 14-15 అంగుళాల పొడవున్న నా ఫొటో ఉంది’ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

Virat Kohli Vs Aus

‘నన్ను నిషేధించవద్దు’

కోహ్లీ మాట్లాడుతూ, “నేను వెంటనే సారీ చెప్పాను. ‘నన్ను క్షమించండి, నన్ను నిషేధించకండి’ అన్నాను. దీంతో రిఫరీ నా మ్యాచ్ ఫీజులో సగం తగ్గించాడు, నువ్వు ఇంకా చిన్నవాడివి, నీ కెరీర్ నాశనం చేసుకోవద్దని రిఫరీ సూచించాడు’ అని తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..