Sourav Ganguly: వామ్మో.. ఒక్కో ఎపిసోడ్‌కి లక్షల్లో రెమ్యూనరేషన్.. ‘దాదాగిరి’ రియాలిటీ షో క్రేజ్ మాములుగా లేదుగా..

Sourav Ganguly Remuneration For Dadagiri Reality Show: సౌరవ్ గంగూలీ 2009 నుంచి 'దాదాగిరి' అనే రియాల్టీ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది పశ్చిమ బెంగాల్‌లోని వివిధ జిల్లాల నుంచి పోటీదారులను ఎంపిక చేసే క్విజ్ షో. ఈ క్విజ్ షోకి ఫన్నీ యాంగిల్ కూడా ఇస్తుంటారు. ఈ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' వంటి సీరియస్‌నెస్, హాస్యం రెండింటినీ మిక్స్ చేసి నిర్వహిస్తున్నారు. అనేక రౌండ్లు ఉన్న ఈ షోలో ప్రైజ్ మనీ భారీగానే ఉంది.

Sourav Ganguly: వామ్మో.. ఒక్కో ఎపిసోడ్‌కి లక్షల్లో రెమ్యూనరేషన్.. 'దాదాగిరి' రియాలిటీ షో క్రేజ్ మాములుగా లేదుగా..
Sourav Ganguly Remuneration
Follow us
Venkata Chari

|

Updated on: Jul 09, 2024 | 8:03 PM

Sourav Ganguly Remuneration For Dadagiri Reality Show: టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రస్తుతం క్రికెట్ వ్యాఖ్యాతగా కనిపిస్తున్నారు. దీనితో పాటు, అతను బెంగాలీ టీవీ ఛానెల్‌లో రియాలిటీ షోను కూడా హోస్ట్ చేస్తున్నాడు. సౌరవ్ గంగూలీ 2009 నుంచి ఈ రియాలిటీ షోను హోస్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం రియాలిటీ షో పదవ సీజన్‌ను హోస్ట్ చేస్తున్నాడు. బెంగాల్‌లో సినీ నటుల కంటే ఎక్కువ పాపులర్ అయిన గంగూలీ రియాల్టీ షోకి సహజంగానే టీఆర్‌పీ రేటింగ్ ఎక్కువగా ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ఆ షో హోస్ట్‌గా వ్యవహరించినందుకు గంగూలీకి భారీ జీతం వస్తుంది. ఆ షో పేరు ‘దాదాగిరి’.

సౌరవ్ గంగూలీ 2009 నుంచి ‘దాదాగిరి’ అనే రియాల్టీ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది పశ్చిమ బెంగాల్‌లోని వివిధ జిల్లాల నుంచి పోటీదారులను ఎంపిక చేసే క్విజ్ షో. ఈ క్విజ్ షోకి ఫన్నీ యాంగిల్ కూడా ఇస్తుంటారు. ఈ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ వంటి సీరియస్‌నెస్, హాస్యం రెండింటినీ మిక్స్ చేసి నిర్వహిస్తున్నారు. అనేక రౌండ్లు ఉన్న ఈ షోలో ప్రైజ్ మనీ భారీగానే ఉంది. కానీ, సౌరవ్ గంగూలీ షోలో పాల్గొన్న అందరి కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు.

పదో సీజన్ కోసం సౌరవ్ గంగూలీ ఈ షో ద్వారా భారీ మొత్తంలో సంపాదిస్తున్నాడు. ఒక్కో ఎపిసోడ్‌కి గంగూలీకి రూ.50 లక్షల పారితోషికం తీసుకుంటున్నాడంట. ఈ షో ద్వారా సౌరవ్ గంగూలీ నెలకు దాదాపు నాలుగు కోట్ల రూపాయలు జేబులో వేసుకుంటున్నాడు. ఇది బెంగాల్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన షో. ఇది వారానికి రెండు రోజులు మాత్రమే ప్రసారం అవుతుంది.

సౌరవ్ గంగూలీ 2009 నుంచి ఈ షోను హోస్ట్ చేస్తున్నాడు. అయితే మూడవ సీజన్‌లో గంగూలీ స్థానంలో బెంగాలీ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి వచ్చారు. కానీ అతను ఆ సీజన్‌ తర్వాత తొలగించబడ్డాడు. గంగూలీకి తిరిగి వచ్చాడు. గంగూలీ కాస్త సీరియస్ స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ, కంటెస్టెంట్స్‌తో లైట్ జోకులు వేస్తుంటాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే