WTC Final: టీమిండియా ఫ్లాప్ షోకి కారణం ఐపీఎల్.. ఒక్కరికీ గెలవాలనే కసిలేదంటూ నెటిజన్ల ఫైర్..

IND vs AUS: ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమ్ ఇండియా పేలవ ప్రదర్శనకు ఐపీఎల్ కారణమని సోషల్ మీడియాలో అభిమానులు అంటున్నారు. దీంతో బీసీసీఐతో పాటు భారత జట్టుపై అభిమానులు నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. భారత ఆటగాళ్లను చూస్తుంటే.. అసలు మ్యాచ్ గెలవాలనే మనస్తత్వం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

WTC Final: టీమిండియా ఫ్లాప్ షోకి కారణం ఐపీఎల్.. ఒక్కరికీ గెలవాలనే కసిలేదంటూ నెటిజన్ల ఫైర్..
Wtc Final Ind Vs Aus
Follow us
Venkata Chari

|

Updated on: Jun 09, 2023 | 4:46 PM

IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఓవల్‌ మైదానంలో ఇరు జట్లు ముఖాముఖిగా తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 469 పరుగులు చేసింది. కంగారూల తరపున ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ అద్భుత సెంచరీలు చేశారు. అదే సమయంలో ఆస్ట్రేలియా చేసిన 469 పరుగులకు సమాధానంగా టీమిండియా వార్తలు రాసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 234 పరుగులతో ఆడుతోంది. భారత్ తరపున అజింక్యా రహానే 71, శార్దూల్ ఠాకూర్ 30 క్రీజులో ఉన్నారు.

బీసీసీఐ, టీం ఇండియా ఆటగాళ్లపై అభిమానులు ఆగ్రహం..

ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమ్ ఇండియా పేలవ ప్రదర్శనకు ఐపీఎల్ కారణమని సోషల్ మీడియాలో అభిమానులు అంటున్నారు. దీంతో బీసీసీఐతో పాటు భారత జట్టుపై అభిమానులు నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. భారత ఆటగాళ్లను చూస్తుంటే.. అసలు మ్యాచ్ గెలవాలనే మనస్తత్వం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ను చాలా లైట్‌గా తీసుకుంటున్నారంటూ విమర్శిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అలాగే ఐపీఎల్ సీజన్ దాదాపు 2 నెలల పాటు సాగిందని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడేందుకు భారత జట్టు ఇంగ్లాండ్‌కు వెళ్లింది. దీంతో ఆటగాళ్లకు విశ్రాంతి తీసుకునే అవకాశం లభించలేదు. ఆస్ట్రేలియా జట్టులోని చాలామంది ఆటగాళ్లు చాలా ఫ్రెష్‌గా డబ్ల్యూటసీ ఫైనల్ ఆడేందుకు వచ్చారని కామెంట్స్ చేస్తున్నారు.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ పేలవ ప్రదర్శనకు ఐపీఎల్ కారణమా?

1. IPL 2023 సీజన్ దాదాపు 2 నెలల పాటు కొనసాగింది. ఆ తర్వాత టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లారు. దీంతో ఆటగాళ్లకు విశ్రాంతి దొరకలేదు.

2. IPL 2023 ఫైనల్ మ్యాచ్ మే 29న జరిగింది. దీంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియాకు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడే అవకాశం దక్కలేదు.

3. భారత జట్టు ఇంగ్లండ్ పరిస్థితికి అనుగుణంగా మార్చుకోవడంలో విఫలమైంది.

4. అదే సమయంలో మాజీ భారత ఆల్ రౌండర్ బౌలర్ల లైన్, లెంగ్త్ గురించి ప్రశ్నల వర్షం కురిపించారు. ఐపీఎల్‌లో 4 ఓవర్లు వేయడానికి, టెస్టుల్లో బౌలింగ్‌కు తేడా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

5. భారత ఆటగాళ్లతో పోలిస్తే, ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు మానసికంగా మరింతగా సిద్ధమయ్యారు. అలాగే ఫ్రెష్‌గా వచ్చారు.

6. చాలా మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడలేదు. ఈ కారణంగా, వారు మానసికంగా ఉల్లాసంగా ఉన్నారు.

ఇది ఇలాగే సాగితే.. అన్ని ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా పరిస్థితి మరింత దిగజారుతుందని, అప్పుడు అంతర్జాతీయ వేదికల్లో టీమిండియా ప్రస్థానం ముగిసిపోయినట్లేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇకనైనా బీసీసీఐ ఈ విషయంలో తర్వగా ఓ నిర్ణయం తీసుకోకుంటే.. టీమిండియా ఆటగాళ్లంతా ఐపీఎల్ బ్యాచ్ అనే ముద్ర వేసుకోవడం ఖాయమని తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..