క్రికెట్‌లో ఫాస్టెస్ట్ బాల్ రికార్డ్ ఎవరిది, స్పీడ్ ఎంతో తెలుసా? బ్రేక్ చేసేందుకు సిద్ధమైన భారత యువ పేసర్..
రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన పాకిస్తానీ మాజీ ఫాస్ట్ బౌలర్, 2003 ప్రపంచ కప్ సందర్భంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గంటకు 161.3 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు.
క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా బంతిని విసిరిన రికార్డును పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సొంతం చేసుకున్నాడు. రావల్పిండి ఎక్స్‌ప్రెస్ పేరునే తన పేరుగా మార్చుకున్న పాకిస్తానీ మాజీ ఫాస్ట్ బౌలర్, 2003 ప్రపంచ కప్ సందర్భంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గంటకు 161.3 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు. అయితే క్రికెట్ చరిత్రలో ఇదే అత్యంత వేగవంతమైన బంతిగా నిలిచింది. షోయబ్ అక్తర్ రికార్డు నెలకొల్పిన దాదాపు 20 ఏళ్ల తర్వాత కూడా ఏ బౌలర్ కూడా ఈ వేగంతో బంతిని విసరలేకపోయాడు. అయితే ఈ ఏడాది షోయబ్ అక్తర్ రికార్డును బద్దలు కొట్టవచ్చని తెలుస్తోంది.
రికార్డును బ్రేక్ చేసేందుకు సిద్ధమైన ఉమ్రాన్ మాలిక్..
ఇటీవల భారత్, శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌లో భారత ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ గంటకు 155 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత ఉమ్రాన్ మాలిక్ పేరు హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ప్రస్తుతానికి, భారత ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ బాల్ రికార్డును బద్దలు కొట్టగలడని విశ్వసిస్తున్నారు. నిజానికి 2022లో టీమ్ ఇండియా చాలా మ్యాచ్‌లు ఆడుతుంది. అదే సమయంలో, ఉమ్రాన్ మాలిక్ చాలా మ్యాచ్‌లు ఆడే అవకాశాలను పొందనున్నాడు.
షోయబ్ అక్తర్ రికార్డుపై ఉమ్రాన్ మాలిక్ కన్ను..
షోయబ్ అక్తర్ రికార్డుపై ఉమ్రాన్ మాలిక్ ఓ కన్నేశాడు. ఇటీవల, ఉమ్రాన్ మాలిక్ షోయబ్ అక్తర్ రికార్డును బద్దలు కొట్టగలనని, అయితే భారత్‌కు మెరుగైన ప్రదర్శన చేయడమే నా ప్రాధాన్యత అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్‌లో ఏ స్పీడ్‌తో బౌలింగ్ చేస్తున్నామో ఆ సమయంలో తెలియదని పేర్కొన్నాడు. బౌలింగ్ వేగం మ్యాచ్ ముగిసిన తర్వాత తెలుస్తుంది. మ్యాచ్ జరిగే సమయంలో నా దృష్టి మంచి ప్రదేశాల్లో బౌలింగ్ చేసి వికెట్లు తీయడమేనని భారత ఫాస్ట్ బౌలర్ తెలిపాడు. అయితే పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ రికార్డును ఉమ్రాన్ మాలిక్ బద్దలు కొట్టగలడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..