Video: సూర్య చేతికి దండం పెడుతూ, ముద్దాడిన భారత స్టార్ స్పిన్నర్.. ప్రత్యర్థి జట్టులో ఉంటే బలిపశువులమే అంటూ..

IND vs SL: రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ సెంచరీ సాధించి, టీమ్ ఇండియా సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

Video: సూర్య చేతికి దండం పెడుతూ, ముద్దాడిన భారత స్టార్ స్పిన్నర్.. ప్రత్యర్థి జట్టులో ఉంటే బలిపశువులమే అంటూ..
Ind Vs Sl Suryakumar Yadav
Follow us
Venkata Chari

|

Updated on: Jan 08, 2023 | 6:46 PM

సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం అత్యుత్తమ టీ20 బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచాడు. అవకాశం వచ్చిన ప్రతీసారి.. తన సత్తా చాటుతూ టీ20 ప్రపంచకప్‌లో నంబర్ 1గా నిలిచాడు. శనివారం శ్రీలంకతో జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో సూర్యకుమార్ సెంచరీ చేసి భారత్‌కు సిరీస్‌ను కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. 2023లో టీ20లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్ నిలిచాడు. టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్‌ తరపున అతని ఇన్నింగ్స్‌ అత్యంత వేగవంతమైన సెంచరీగానూ నిలిచింది. ఈ ఇన్నింగ్స్ తర్వాత, భారత జట్టు లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సూర్యకుమార్ చేతికి దండం పెట్టి, ముద్దుపెట్టుకున్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ 51 బంతుల్లో 112 పరుగులతో అజేయంగా నిలిచాడు. 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సూర్యకుమార్ నిలిచాడు. అతను మూడు మ్యాచ్‌ల్లో 170 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని సగటు 85, స్ట్రైక్ రేట్ 175.25గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

సూర్య చేతికి ముద్దుపెట్టిన చాహల్..

మ్యాచ్ అనంతరం భారత జట్టు లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సూర్యకుమార్ ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. సూర్య చేతులకు దండం పెడుతూ, ముద్దాడాడు. చాహల్‌కి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాహల్ మొదట సూర్యకుమార్ చేతులను తన రెండు కళ్లతో తాకి, ఆపై అతని రెండు చేతులను ఒక్కొక్కటిగా ముద్దుపెట్టుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో చాహల్ కూడా బాగా బౌలింగ్ చేసి తన మూడు ఓవర్లలో 30 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. 14 బంతుల్లో 22 పరుగులు చేసి ప్రమాదకరంగా కనిపిస్తున్న ధనంజయ్ డిసిల్వా వికెట్‌ను చాహల్ పడగొట్టాడు. అంతే కాకుండా చరిత అసలంకను కూడా పెవిలియన్ దారి చూపించాడు. అసలంక 19 పరుగులు చేశాడు.

సూర్య ప్రత్యర్థి టీమ్‌లో లేకపోవడం నా అదృష్టం – చాహల్

సూర్యకుమార్ ప్రత్యర్థి జట్టులో లేకపోవడం తన అదృష్టమని చాహల్ పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం చాహల్ మాట్లాడుతూ, “మ్యాచ్ తర్వాత, నేను కోచ్‌లతో మాట్లాడి, సూర్యకుమార్‌కు ఏ పేస్, లైన్‌లో బౌలింగ్ చేయాలని అడిగాను. అతను వేరే స్థాయిలో బ్యాటింగ్ చేస్తున్నాడు. నేను అతని జట్టులో ఉన్నందుకు సంతోషంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

సూర్యకుమార్ టీ 20లో మూడు సెంచరీలు సాధించగా, ఆరు నెలల్లోనే ఈ ఘనత సాధించాడు. అతను 10 జులై 2022న నాటింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌పై మొదటి టీ20 సెంచరీని సాధించాడు. అదే సమయంలో, రెండవ సెంచరీ 20 నవంబర్ 2022న న్యూజిలాండ్‌పై మౌంట్ మౌంగానుయ్‌లో నమోదైంది. ఆ తర్వాత, శ్రీలంకపై సెంచరీ సాధించాడు. ఇది భారతదేశంలో అతని మొదటి టీ20 సెంచరీ.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..