T20 World Cup: ‘ఈ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. టీ20ల్లో కాబోయే నంబర్ వన్ బౌలర్.. పొట్టి ప్రపంచకప్ జట్టులో ఉంచాల్సిందే’
భారత మాజీ కెప్టెన్, మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ యువ ఫాస్ట్ బౌలర్‌పై ప్రసంశల జల్లు కురింపించారు. T20 ప్రపంచ కప్ జట్టులో కచ్చితంగా ఉండాలని సూచించారు. ఉంటాడని చెప్పాడు. రానున్న కాలంలో టీ20లో నంబర్ వన్ బౌలర్‌గా చేస్తానని చెప్పాడు.
T20 ప్రపంచ కప్ 2022కి ముందు, అన్ని జట్లు తమ బలాలను పరిశీలించుకుంటున్నాయి. ఇందుకోసం ప్రపంచకప్‌కు ముందు అన్ని జట్లు తమ బెంచ్ స్ట్రెంత్‌ను పటిష్టం చేసుకునేందుకు పలు సిరీస్‌లతో బిజీగా మారాయి. గత టీ20 ప్రపంచకప్ నుంచి ఇప్పటి వరకు భారత్ 11 మంది ఫాస్ట్ బౌలర్లకు అవకాశం ఇచ్చింది. వారిలో కొందరు IPL 2022లో అద్భుతంగా బౌలింగ్ చేయడం ద్వారా తమ సత్తా చూపించారు. అయినప్పటికీ వారు టీమ్ ఇండియాలో తమ స్థానాన్ని సంపాదించుకోవడంలో విజయం సాధించలేకపోయారు.
ఈ క్రమంలో భారత బౌలింగ్ లైనప్‌పై భారత మాజీ కెప్టెన్, సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందించారు. భారత యువ బౌలర్లలో కొంతమందిని ఎంతగానో ఆకట్టుకునేవారు ఉన్నారని, వారిని T20 ప్రపంచ కప్‌నకు ముందు జట్టులో చేర్చాలని సూచించారు. ఫ్యాన్‌కోడ్ ప్రోగ్రామ్‌లో ఆయన మాట్లాడుతూ, అర్ష్‌దీప్ సింగ్ భవిష్యత్ గురించి జోస్యం చెప్పారు. రానున్న కాలంలో టీ20ల్లో అత్యుత్తమ బౌలర్‌గా రాణిస్తానని చెప్పుకొచ్చారు.
అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌పై ఈ మాజీ ప్లేయర్ ప్రసంశల వర్షం కురిపంచాడు. ఐపీఎల్ 2022లో డెత్ ఓవర్లలో అర్ష్‌దీప్ తన బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. అతను గత ఇంగ్లాండ్ పర్యటనలో తన T20 అరంగేట్రం చేసే అవకాశాన్ని పొందాడు. అప్పటి నుంచి అతను 4 మ్యాచ్‌లలో 6 వికెట్లు తీసుకున్నాడు. అందులో అతను డెత్ ఓవర్‌లో 5 వికెట్లు తీయడం గమనార్హం.