Team India: టార్గెట్ టీ20 ప్రపంచకప్.. ఆస్ట్రేలియా – సౌతాఫ్రికాలతో టీమిండియా హోమ్ సిరీస్.. ఫుల్ షెడ్యూల్ ఇదే..
సెప్టెంబర్-అక్టోబర్ నెలలో స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది.
సెప్టెంబరు-అక్టోబర్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరగనున్న సిరీస్‌ల షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. ఆస్ట్రేలియాతో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. అదే సమయంలో దక్షిణాఫ్రికాతో మూడు టీ20లోపాటు మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. BCCI షెడ్యూల్ ప్రకారం, భారతదేశం మొహాలీ (సెప్టెంబర్ 20), నాగ్‌పూర్ (సెప్టెంబర్ 23), హైదరాబాద్ (సెప్టెంబర్ 25) లలో ఆస్ట్రేలియాతో ఆడుతుంది. ఆ తర్వాత తిరువనంతపురంలో (సెప్టెంబర్ 28) దక్షిణాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. అదే సమయంలో, గాంధీ జయంతి సందర్భంగా, గౌహతి (అక్టోబర్ 2), ఇండోర్ (అక్టోబర్ 4) లో రెండవ, చివరి టి20 మ్యాచ్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో లక్నో (అక్టోబర్ 6), రాంచీ (అక్టోబర్ 9), ఢిల్లీ (అక్టోబర్ 11)లో భారత్ 3 వన్డేలు ఆడనుంది.
టీ20 ప్రపంచకప్‌లో భాగమయ్యే భారత ఆటగాళ్లు ప్రపంచకప్‌కు సన్నద్ధం కావడానికి ఆస్ట్రేలియా వెళ్లనున్నందున వన్డే సిరీస్‌లో పాల్గొనే అవకాశం లేదు. ఇటువంటి పరిస్థితిలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో, టీమిండియా రెండవ జట్టు రంగంలోకి దిగవచ్చని తెలుస్తోంది. T20 ప్రపంచకప్ సూపర్-12 దశ అక్టోబర్ 22 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 23న మెల్‌బోర్న్‌లో ఈ మ్యాచ్ జరగనుంది.
బీసీసీఐ విడుదల చేసిన టీమిండియా షెడ్యూల్ ట్వీట్..
Check out the #INDvSA home series schedule. ?#TeamIndia | @BCCI | @OfficialCSA pic.twitter.com/jo8zC4hjDq
— BCCI (@BCCI) August 3, 2022
భారత్ vs ఆస్ట్రేలియా:
1వ టీ20 – 20 సెప్టెంబర్ (మొహాలీ)
2వ టీ20 – 23 సెప్టెంబర్ (నాగ్‌పూర్)
3వ టీ20 – 25 సెప్టెంబర్ (హైదరాబాద్)
భారత్ vs దక్షిణాఫ్రికా:
1వ టీ 20 – 28 సెప్టెంబర్ (తిరువనంతపురం)
2వ టీ20 – 2వ తేదీ అక్టోబర్ (గౌహతి) 3వ టీ
3వ టీ20 – 4వ తేదీ అక్టోబర్ (ఇండోర్)
1వ వన్డే – అక్టోబర్ 6 (లక్నో)
2వ వన్డే – అక్టోబర్ 9 (రాంచీ) అక్టోబర్
3వ వన్డే – 11వ తేదీ (ఢిల్లీ)