అరంగేట్రంలోనే ప్రత్యర్థులకు బ్లడ్‌బాత్.. కట్‌చేస్తే.. రిటైర్మెంట్‌తో ఊహించని షాకిచ్చిన ముగ్గురు టీమిండియా బౌలర్లు

Team India: కొందరు క్రికెటర్లు ఎంతో వేగంగా పేరు సంపాదిస్తుంటారు. అలాగే, అంతే వేగంగా కనుమరుగైపోతుంటారు. తమ ఆటతో ప్రత్యర్థులను గడగడలాడించిన ఎంతోమంది ప్లేయర్లు, కాలక్రమేణా తమ వైభవం కోల్పోయి పేలవ ఫాంతో రిటైర్మెంట్ చేయాల్సి వచ్చింది. అలాంటి లిస్ట్‌లో ముగ్గురు టీమిండియా బౌలర్లు ఉన్నారు.

అరంగేట్రంలోనే ప్రత్యర్థులకు బ్లడ్‌బాత్.. కట్‌చేస్తే.. రిటైర్మెంట్‌తో ఊహించని షాకిచ్చిన ముగ్గురు టీమిండియా బౌలర్లు
Team India
Follow us
Venkata Chari

|

Updated on: Nov 18, 2024 | 6:26 AM

Team India: భారత క్రికెట్ జట్టులో ముగ్గురు డేంజరస్ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. అయితే, వీరి కెరీర్ మాత్రం ఎంతో గొప్పగా ప్రారంభమైంది. ఆ తర్వాత అనుకోకుండానే కెరీర్ ముగించాల్సి వచ్చింది. ఈ ముగ్గురు భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా కంటే ప్రమాదకరంగా ఉండేవారు. ఈ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లకు మరిన్ని అవకాశాలు లభించి ఉంటే జస్ప్రీత్ బుమ్రా కంటే ఎంతో గొప్ప పేరు పొందేవారు. నిజానికి, టీమ్ ఇండియాలో ఎంపిక కావడం ఎంత కష్టమో, టీమ్ ఇండియాలో ప్లేస్ నిలుపుకోవడం చాలా కష్టం. ఎందుకంటే చాలా మంది ఆటగాళ్లు తమ అద్భుతమైన ప్రదర్శన ఆధారంగా భారత జట్టులో స్థానం పొందేందుకు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓసారి ప్లేస్ దక్కితే, ఆ స్థానాన్ని కలకాలం నిపుకోవాలంటే ఎంతో కష్టపడాల్సిందే. కాగా, త్వరగా కెరీర్ ముగించిన ముగ్గురు ప్లేయర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఇర్ఫాన్ పఠాన్..

ఇర్ఫాన్ పఠాన్ 2004లో భారత్ తరపున తన క్రికెట్ కెరీర్‌ను ఎంతో ఉత్సాహంగా ప్రారంభించాడు. ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్‌లో మొదట్లో అద్భుతమైన స్వింగ్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపించేవాడు. ఈ కారణంగా పఠాన్ బౌలింగ్‌లో ఆడటం చాలా కష్టమైంది. ఇర్ఫాన్ పఠాన్ 2004లో ఐసిసి నుంచి ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ టైటిల్‌ను అందుకున్నాడు. భారత్‌ తరపున తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్‌ సాధించిన ఏకైక బౌలర్‌‌గా నిలిచాడు. కానీ, తర్వాత ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్‌లో అసమర్థంగా కనిపించడం ప్రారంభించాడు. ఇర్ఫాన్ పఠాన్ భారత జట్టు తరపున 29 టెస్టు మ్యాచ్‌లు, 120 వన్డేలు, 24 టీ-20 మ్యాచ్‌లు ఆడాడు.

2. ఆర్పీ సింగ్..

శుభారంభం తర్వాత కనుమరుగైన భారత్‌కు ఆర్పీ సింగ్ కూడా డేంజరస్ బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతను తన అద్భుతమైన స్వింగ్ బౌలింగ్‌కు కూడా పేరుగాంచాడు. 2007 టీ-20 ప్రపంచ కప్‌ను భారత జట్టు గెలుచుకోవడంలో ఆర్‌పీ సింగ్ కూడా చాలా కీలక పాత్ర పోషించాడు. కానీ, కాలక్రమేణా, RP సింగ్ తన స్వింగ్‌ను కోల్పోయాడు. అతను ప్రతి మ్యాచ్‌లో చాలా ఖరీదైనదిగా నిరూపించడం మొదలైంది. ఆర్పీ సింగ్ భారత జట్టు తరపున 14 టెస్టు మ్యాచ్‌లు, 58 వన్డే మ్యాచ్‌లు, 10 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు.

ఇవి కూడా చదవండి

3. మోహిత్ శర్మ..

మోహిత్ శర్మ 2013లో భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. మోహిత్ శర్మ భారత జట్టుకు తన కెరీర్ ప్రారంభంలో చాలా మంచి వేగంతో బౌలింగ్ చేశాడు. అతను తన స్వింగ్, స్లో బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను చాలా ఇబ్బంది పెట్టాడు. మోహిత్ శర్మ కూడా 2015 ప్రపంచకప్‌లో భారత జట్టుకు చాలా బాగా ఆడాడు. కానీ, ప్రపంచ కప్ 2015 తర్వాత, అతని బౌలింగ్ నిరంతరం క్షీణించడం ప్రారంభించింది. ఫలితంగా అతను భారత జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. భారత జట్టు తరపున మోహిత్ శర్మ 26 వన్డేలు, 8 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..