
యార్కర్ల స్పెషలిస్ట్‌గా పేరొందిన టీమిండియా పేసర్ టి. నటరాజన్ కల సాకారమైంది. తన గ్రామంలో క్రికెట్ గ్రౌండ్‌ను ఏర్పాటుచేయాలన్న కలను నెరవేర్చుకున్నాడీ పేసర్. తాజాగా నటరాజన్ క్రికెట్ గ్రౌండ్‌ను భారత వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ప్రారంభించాడు. తన ఊరిలోని యువ ప్రతిభావంతులకు శిక్షణ ఇచ్చేందుకు తగిన వేదికను అందించడమే నటరాజన్ లక్ష్యం. ఇందుకోసం తన గ్రామంలో అన్ని సౌకర్యాలతో కూడిన క్రికెట్ గ్రౌండ్‌ను నిర్మించి తన కలను సాకారం చేసుకున్నాడు. తమిళనాడులోని సేలం సమీపంలోని చిన్నంపట్టి అనే గ్రామంలో నటరాజన్ ఈ క్రికెట్ మైదానాన్ని నిర్మించాడు నజరాజన్. తన లాంటి వారు ఎంతోమంది దేశం కోసం ఆడాలి. అందుకు తగిన వేదిక కావాలనే ఏకైక లక్ష్యంతో సొంత డబ్బులతో ఈ స్టేడియాన్ని నిర్మించాడు నటరాజన్. తాజాగా ఈ క్రికెట్ గ్రౌండ్ ఓపెనింగ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. అశోక్ సిగమణి, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, సేలం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆర్. శివకుమార్ సహా తమిళ సినీ పరిశ్రమకు చెందిన యోగిబాబు తదితరులు హాజరయ్యారు.
‘మా గ్రామంలో పూర్తి స్థాయి క్రికెట్ మైదానం ఏర్పాటుచశాను అని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం కల్పించిన ఆ భగవంతునికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అని నటరాజన్ ఎమోషనల్ అయ్యాడు. కాగా ఈ క్రికెట్ గ్రౌండ్‌కు నటరాజన్ క్రికెట్ గ్రౌండ్ (NCG) అని పేరు పెట్టారు. కాగా 2020 ఐపీఎల్ సీజన్‌లో అందరి దృష్టిని ఆకర్షించాడు నటరాజన్. పదునైన యార్కర్ లతో టీమిండియాలో చోటు సంపాదించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రాణించాడు. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా తరఫున ఆడాడు. అయితే దురదృష్టవశాత్తూ గాయపడడంతో జట్టులో చోటు కోల్పోయాడు. ఐపీఎల్ తర్వాత నటరాజన్ వ్యక్తిగత జీవితం కూడా మారిపోయింది. దినసరి కూలీగా ఉండే తన తల్లిదండ్రులకు నటరాజన్ సొంత ఇల్లు కట్టించాడు. అక్కాచెల్లెళ్లకు మంచి చదువులు చెప్పిస్తున్నాడు. ఇప్పుడు అతను తన సొంత క్రికెట్ అకాడమీని కూడా ప్రారంభించాడు. తద్వారా తన గ్రామంలోని ఇతర ప్రతిభావంతులైన ఆటగాళ్లకు క్రికెట్ నేర్చుకోవడానికి మంచి వేదికను అందించాడు.
An honour for me to inaugurate and begin this exciting journey of Natarajan Cricket Academy which will give wings to several young talents in and around Chinnappampatti. Kudos to my friend @Natarajan_91 for bringing this dream to life. pic.twitter.com/gancscZgwb
— DK (@DineshKarthik) June 26, 2023
— Natarajan (@Natarajan_91) June 23, 2023
Wishing to witness many more inspiring stories from the Natarajan Cricket Ground 🧡 pic.twitter.com/72xWAEuPeL
— SunRisers Hyderabad (@SunRisers) June 24, 2023
— Yogi Babu (@iYogiBabu) June 26, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..