Watch Video: గర్ల్‌ఫ్రెండ్‌తో పెళ్లికి సిద్ధమైన టీమిండియా బౌలర్.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
టీమిండియా ఆటగాడు రాహుల్ చాహర్ తన స్నేహితురాలు ఇషానిని పెళ్లి చేసుకోబోతున్నాడు. పెళ్లికి ముందు జరిగిన కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.
భారత క్రికెట్ జట్టు ఆటగాడు రాహుల్ చాహర్(Rahul Chahar) తన స్నేహితురాలు ఇషానిని పెళ్లి చేసుకుంటున్నాడు. పెళ్లికి ముందు జరిగిన కార్యక్రమాలకు సంబంధించిన వీడియోను నెట్టింట్లో షేర్ చేశాడు. ఇందులో రాహుల్ చాహరత్‌తోపాటు అతని భార్య ఇషానీ కనిపించింది. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన రాహుల్‌ను ఈసారి పంజాబ్ కింగ్స్(Punjab kings) కొనుగోలు చేసింది. 2022 ఐపీఎల్(IPL 2022) వేలంలో పంజాబ్ అతడిని రూ.5.25 కోట్లకు కొనుగోలు చేసింది. మీడియా కథనాల ప్రకారం, ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ సోదరుడు రాహుల్ తన స్నేహితురాలు ఇషానిని మార్చి 9న రాత్రి వివాహం చేసుకుంటున్నాడు. అంతకుముందు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోతోపాటు కొన్ని చిత్రాలను పంచుకున్నాడు. వీడియోలో, రాహుల్, ఇషానీ వారి చేతులకు గోరింట పెట్టుకోవడం కనిపిస్తుంది. దీంతో పాటు డ్యాన్స్ కూడా చేశారు.
రాహుల్, ఇషాన్ ఫోటో షూట్‌లు కూడా చేశారు. వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్ అయిన ఇషానీ చాలా కాలంగా రాహుల్‌తో ప్రేమలో ఉంది. ఎట్టకేలకు నేడు పెళ్లి చేసుకోనున్నారు. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతున్నాయి.
రాహుల్ చాహర్ ఐపీఎల్ మ్యాచ్‌లలో అద్భుతంగా ఆడడంతో, టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. భారత్ తరఫున ఇప్పటి వరకు 6 టీ20 మ్యాచ్‌లు ఆడిన రాహుల్ 7 వికెట్లు తీశాడు. అతను ఒక వన్డే మ్యాచ్ కూడా ఆడాడు. రాహుల్ 42 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 43 వికెట్లు తీశాడు.
View this post on Instagram
View this post on Instagram
Also Read: రవీంద్ర జడేజా ‘సర్ జడేజా’ ఎలా అయ్యాడో తెలుసా?
Indian Cricket Team: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా పాస్ట్ బౌలర్.. వారి కోసమే అంటూ ప్రకటన..