AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా ప్రమోషన్ కొట్టేసిన టీమిండియా ఆల్ రౌండర్?

Delhi Capitals Captain For IPL 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో అక్షర్ పటేల్ బ్యాట్, బంతి రెండింటిలోనూ అద్భుతంగా రాణించాడు. ఇప్పుడు అతనికి మరో పెద్ద బాధ్యత లభించవచ్చు అని తెలుస్తోంది. అతను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా నియమితులయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

IPL 2025: ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా ప్రమోషన్ కొట్టేసిన టీమిండియా ఆల్ రౌండర్?
Team India
Venkata Chari
|

Updated on: Mar 11, 2025 | 7:45 AM

Share

Axar Patel Captain For Delhi Capitals: ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌కు మరో శుభవార్త అందుతున్నట్లు కనిపిస్తోంది. అతను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ కాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాబోయే సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీకి అక్షర్ పటేల్, సీనియర్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ ఇద్దరూ పోటీ పడుతున్నారు. అయితే, ఈ రేసులో గుజరాత్ ఆటగాడు అక్షర్ పటేల్‌కు కాస్త పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత, ఫ్రాంచైజీ అధికారులు రాబోయే కొద్ది రోజుల్లో తమ కొత్త కెప్టెన్ పేరును ప్రకటిస్తారని భావిస్తున్నారు. దీనికి ముందు, ఢిల్లీ క్యాపిటల్స్ తమ మొదటి రెండు మ్యాచ్‌ల కోసం విశాఖపట్నం వెళ్లే ముందు ఢిల్లీలో ఒక చిన్న శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయనుంది.

కేఎల్ రాహుల్ కొన్ని మ్యాచ్‌లకు దూరమవొచ్చు..

అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, దక్షిణాఫ్రికాకు చెందిన ట్రిస్టన్ స్టబ్స్, ఆస్ట్రేలియా ఆటగాళ్ళు జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, మిచెల్ స్టార్క్ మార్చి 17, 18 తేదీలలో విశాఖపట్నంలో సమావేశమవుతారు. అయితే, రాహుల్ భార్య అతియా శెట్టి గర్భవతిగా ఉన్నందున ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు ఆడకపోవచ్చు అని తెలుస్తోంది. ఇది వారి మొదటి బిడ్డ పుట్టిన తేదీపై ఆధారపడి ఉంటుంది.

అక్షర్ ఢిల్లీ క్యాపిటల్స్ సీనియర్ ఆటగాడు..

ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఏడవ సీజన్ ఆడుతోన్న 31 ఏళ్ల అక్షర్ పటేల్, రాహుల్ కంటే జట్టును నడిపించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. రాహుల్ తొలిసారి ఢిల్లీ జట్టులో చేరనున్నాడు. అక్షర్ పటేల్ ఇప్పటివరకు 150 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. దాదాపు 131 స్ట్రైక్ రేట్‌తో 1653 పరుగులు చేశాడు. అదనంగా, అతను 7.28 ఎకానమీ రేటుతో 123 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో, గత కొన్ని సంవత్సరాలుగా ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతను పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు నాయకత్వం వహించాడు. అతని పదవీకాలంలో లక్నో జట్టు రెండుసార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. అయితే, ఆ సీజన్లలో ఒకదానిలో ఎక్కువ భాగం అతను గాయపడ్డాడు.

ఇవి కూడా చదవండి

ఏప్రిల్ 18న 33 ఏళ్లు నిండనున్న రాహుల్, 134 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 4683 పరుగులు చేశాడు. అతను 132 మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు కూడా చేశాడు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ బాధ్యత ఎవరికి వస్తుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. ఇది అక్షర్ పటేల్ పేరుతో ఉంటుందా లేదా కేఎల్ రాహుల్‌కు ఈ అవకాశం వస్తుందా? త్వరలోనే ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకోనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..