AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Pak Match: టీచర్‌ ఉద్యోగాన్ని కోల్పోవడానికి కారణమైన ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌.. అసలు విషయం ఏంటంటే..

Teacher suspended INDIA vs Pak: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియాపై పాకిస్తాన్‌ విజయాన్ని సాధించిన విజయం తెలిసిందే. ఏకంగా..

India vs Pak Match: టీచర్‌ ఉద్యోగాన్ని కోల్పోవడానికి కారణమైన ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌.. అసలు విషయం ఏంటంటే..
Ind Vs Pak Match
Ravi Kiran
| Edited By: Anil kumar poka|

Updated on: Oct 27, 2021 | 7:44 PM

Share

Teacher suspended INDIA vs Pak: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియాపై పాకిస్తాన్‌ విజయాన్ని సాధించిన విజయం తెలిసిందే. ఏకంగా 10 వికెట్ల తేడాతో భారత్‌పై సంచలన విజయాన్ని సాధించి చారిత్రక విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్‌ విజయం సాధించడంపై ఆ దేశంలో సంబురాలు మిన్నంటాయి. ఇదిలా ఉంటే పాకిస్తాన్‌ మ్యాచ్‌ గెలవడంపై స్పందించిన భారత్‌కు చెందిన ఓ మహిళా టీచర్‌ ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ జిల్లాకు చెందిన నఫీసా అత్తారి అనే మహిళ స్థానికంగా ఉండే నీర్జా మోదీ అనే స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం పాకిస్తాన్‌ విజయాన్ని సాధించగానే నఫీసా తన వాట్సాప్‌లో స్టేటస్‌లో పాకిస్తాన్‌ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తన వాట్సాప్‌లో స్టేటస్‌లో పోస్ట్‌ చేసింది. ‘మేం గెలిచాం’ (జీత్‌ గయా) అంటూ కామెంట్ పోస్ట్‌ చేసింది. దీంతో ఇది గమనించిన విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒకరు వాట్సాప్‌ స్టేటస్‌ను స్క్రీన్‌ షాట్‌గా తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

దీంతో ఈ పోస్ట్‌ కాస్త వైరల్‌గా మారింది. ఈ విషయం కాస్త పాఠశాల యాజమాన్యం దృష్టిలో పడడంతో నఫీసాను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఆ మహిళా టీచర్‌పై ఇండియన్‌ పీనల్‌ సెక్షన్‌ 153 కింద కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ విషయంపై స్పందించిన నఫీసా.. తాను తప్పు చేశానంటూ వాట్సాప్‌ స్టేటస్‌ను డిలీట్‌ చేసి ఓ వీడియో మెసేజ్‌ను పోస్ట్ చేసింది.

Also Read: Varavara rao: వరవరరావుకు బెయిల్ పొడిగింపు.. హైదరాబాద్‌కు తరలింపు విషయంలో మాత్రం..

Viral Video: ఈ వీడియో చూస్తే మీ పెంపుడు కుక్కతో అస్సలు జోక్ చేయరు.. ఎందుకో తెలుసా..

Carrot farming: రైతుకు వరంగా మారుతున్న రుధిర క్యారెట్ సాగు.. అతి తక్కువ సమయంలో ఎక్కవ దిగుబడి..