Pakistan vs New Zealand: టీ20 వరల్డ్‌కప్‌లో జోరు మీదున్న పాక్.. కివీస్‌పై 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం..

Pakistan vs New Zealand Highlights: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. షార్జా వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో

Pakistan vs New Zealand: టీ20 వరల్డ్‌కప్‌లో జోరు మీదున్న పాక్.. కివీస్‌పై 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం..
T20 World Cup
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 27, 2021 | 6:48 AM

Pakistan vs New Zealand Highlights: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. షార్జా వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. మొన్నటికి మొన్న టీమిండియాపై ఒంటిచేత్తో గెలుపొందిన పాక్.. నేడు న్యూజిలాండ్ వెన్నువెరిచి సెమీఫైనల్స్ చేరేందుకు మరో అడుగు ముందుకు వేసింది. కివీస్ నిర్దేశించిన 135 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 8 బంతులు మిగిలి ఉండగానే చేధించింది.

లక్ష్యచేధనలో భాగంగా పాక్‌కు మొదట మంచి ఆరంభం లభించగా.. పవర్ ప్లే తర్వాత కివీస్ బౌలర్లు పుంజుకోవడంతో పాక్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. అయితే చివర్లో ఆసిఫ్ అలీ(27*), షోయబ్ మాలిక్(26*) ధీటుగా ఆడటంతో పాక్ విజయాన్ని అందుకుంది. కివీస్ బౌలర్లలో సోధీ రెండు వికెట్లు, శాంటర్న్, సౌథీ, బౌల్ట్ తలో వికెట్ పడగొట్టారు.

కాగా, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. పాక్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు నిర్ణీత ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. మిచెల్(27), కాన్వే(27), కెప్టెన్ విలియమ్సన్(25) చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించడంతో కివీస్ ఈ మాత్రమైనా స్కోర్ సాధించగలిగింది. పాక్ బౌలర్లలో రవూఫ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. హఫీజ్, వసీమ్, అఫ్రిది తలో వికెట్ పడగొట్టారు.

Also Read:

India vs Pak Match: టీచర్‌ ఉద్యోగాన్ని కోల్పోవడానికి కారణమైన ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌.. అసలు విషయం ఏంటంటే..

PAK vs NZ Match: పీకల్లోతు కష్టాల్లోకి జారుకుంటోన్న పాకిస్తాన్‌.. లక్ష్య చేధనలో విజయాన్ని చేరేనా.?