క్రికెట్‌లో 132 ఏళ్ల రికార్డు బద్దలకొట్టాడు.. ప్రత్యర్ధులకు భయాన్ని పరిచయం చేశాడు.. మెగా ఆక్షన్‌లోకి.!
అతడు క్రీజులోకి ఎంట్రీ ఇచ్చాడంటే ప్రత్యర్ధి బౌలర్లలో వణుకు పుట్టాల్సిందే. ఓటమి అంచులలో ఉన్న జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందిస్తాడు.
David Warner: అతడు క్రీజులోకి ఎంట్రీ ఇచ్చాడంటే ప్రత్యర్ధి బౌలర్లలో వణుకు పుట్టాల్సిందే. ఓటమి అంచులలో ఉన్న జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందిస్తాడు. మ్యాచ్‌ను క్షణాల్లో మలుపు తిప్పేయగల సత్తా అతడి సొంతం. ఎన్నో రికార్డులు అతడి వశం అయ్యాయి. అంతర్జాతీయ క్రికెట్‌లోనే విధ్వంసకర బ్యాట్స్‌మెన్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకుండానే ఎంట్రీ ఇచ్చాడు.. 132 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. అలాగే ఐపీఎల్‌లోనూ తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నాడు. ఫ్యాన్స్ ముద్దుగా ‘డేవిడ్ భాయ్’ అని పిలుచుకుంటారు. అతడెవరో కాదు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఈ రోజు డేవిడ్ భాయ్ పుట్టినరోజు సందర్భంగా క్రికెట్ సెలబ్రిటీల నుంచి ఫ్యాన్స్ వరకు అందరూ సోషల్ మీడియా వేదికగా వార్నర్‌కు విషెస్ అందిస్తున్నారు.
డేవిడ్ వార్నర్.. తన ఆటతోనే కాదు క్యారెక్టర్‌తోనూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. లాక్ డౌన్ టైంలో తెలుగు పాటలకు టిక్‌టాక్ వీడియోలు చేసి తెలుగు వారికి మరింత దగ్గరయ్యాడు. హైదరాబాద్ జట్టుకు ఎన్నో విజయాలు అందించడంలో కీలక పాత్రను పోషించడమే కాకుండా.. టైటిల్‌ను కూడా అందించాడు. సో వార్నర్ కెరీర్ గురించి ఒకసారి పరిశీలిస్తే..
132 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతూ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకుండానే అంతర్జాతీయ క్రికెట్‌లోకి డేవిడ్ వార్నర్ అడుగుపెట్టాడు. అరంగేట్రం చేసిన తొలి టీ20 మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ, రెండో టెస్టులో సెంచరీ సాధించాడు. విధ్వంకర బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సంపాదించడమే కాకుండా.. ర్యాంకింగ్‌లో దూసుకుపోయాడు. ఆస్ట్రేలియా ప్రపంచకప్ సాధించడంలో.. హైదరాబాద్ జట్టు ఐపీఎల్ ట్రోఫీని అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఒక్క పొరపాటుతో అందరికి విలన్‌గా మారాడు. అయినా కూడా ఏమాత్రం అధైర్యపడకుండా కమ్‌బ్యాక్ ఇచ్చాడు.
2009లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ ద్వారా డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేశాడు. దీంతో 1877 తర్వాత, ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకుండా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మొదటి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో వార్నర్ 43 బంతుల్లో 89 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. టీ20 అరంగేట్రం తర్వాత వారానికే వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు.
న్యూ సౌత్ వేల్స్‌కు ఆడుతున్న సమయంలో డేవిడ్ వార్నర్.. ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. దీనితో అతడ్ని మొదటిగా ఢిల్లీ డేర్‌డెవిల్స్ కొనుగోలు చేసింది. అప్పుడు వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి ఎన్నో భారీ భాగస్వామ్యాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే వరుసగా రెండు సెంచరీలు సాధించాడు. 2013 తర్వాత ఢిల్లీ అతన్ని రిలీజ్ చేయగా.. ఆక్షన్‌లో వార్నర్‌ను సన్‌రైజర్స్ దక్కించుకుంది. ఆ జట్టుకు కెప్టెన్ కావడమే కాకుండా 2016లో హైదరాబాద్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. మూడుసార్లు ఆరెంజ్ క్యాప్, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడిగా రికార్డు సృష్టించాడు. అయితే పేలవ ఫామ్ కారణంగా 2021 ఐపీఎల్ సీజన్‌లో వార్నర్‌ను సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ కెప్టెన్సీ నుంచి తొలగించింది.
Greetings to @davidwarner31 on his 35th birthday – here’s wishing you a very special day! ??#OrangeArmy pic.twitter.com/i54oZGEcdR
— SunRisers Hyderabad (@SunRisers) October 26, 2021
డేవిడ్ వార్నర్ టీ20, వన్డేల్లో అరంగేట్రం చేసిన తర్వాత టెస్టులు ఆడేందుకు మూడేళ్ల సమయం వేచి చూడాల్సి వచ్చింది. అయితే అతడు రెండో టెస్టుకే తన ప్రతిభను నిరూపించుకున్నాడు. అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. ఫిబ్రవరి 2014-జనవరి 2015 మధ్య తొమ్మిది టెస్టులు ఆడి.. ఏడు సెంచరీలు బాదాడు. వీటిలో రెండు సెంచరీలు ఒకే టెస్టులో సాధించడం విశేషం. ఇక వార్నర్ ఇప్పటివరకు 86 టెస్టుల్లో 48.09 సగటుతో 7311 పరుగులు చేశాడు. 24 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు సాధించాడు. అతడి అత్యధిక స్కోర్ 335 నాటౌట్.
2015 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై డేవిడ్ వార్నర్ 133 బంతుల్లో 178 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో, అతడు స్టీవ్ స్మిత్‌తో కలిసి 260 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆస్ట్రేలియా తరఫున ఏ వికెట్‌కైనా ఇదే రెండో అత్యధిక భాగస్వామ్యం. 2015లో ఆస్ట్రేలియా జట్టుకు వైస్ కెప్టెన్ అయిన వార్నర్.. విమర్శకులకు బ్యాట్‌తోనే జవాబిచ్చాడు. 2015లో ఆస్ట్రేలియా ప్రపంచకప్ గెలవడంలో వార్నర్ కీలక పాత్ర పోషించాడు. 128 వన్డేల్లో 45.45 సగటుతో 5455 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో వార్నర్ పేరిట 18 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో 82 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ ఒక సెంచరీ, 18 అర్ధ సెంచరీల సహాయంతో 2279 పరుగులు చేశాడు. 2017 తర్వాత డేవిడ్ వార్నర్ ఆటతీరు నెమ్మదించింది. అలాగే 2018లో కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో పాటు బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంలో నిషేధానికి గురయ్యాడు. ఏడాది పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు.
ఇవి చదవండి:
Viral Video: చెరువులో ఈత కొడుతున్న వ్యక్తి.. అంతలో మొసలి మెరుపు దాడి.. చివర్లో ట్విస్ట్ అదుర్స్.!
IPL 2022: వార్నర్, విలియమ్సన్, నబీ మెగా ఆక్షన్‌లోకి.! వచ్చే ఏడాది మారనున్న సన్‌రైజర్స్ జట్టు..
Samantha: సమంతకు ఊరట.. ఆ లింకులు వెంటనే తొలగించాలంటూ కోర్టు ఆదేశాలు..