AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: రోహిత్-ధోనీలకు సవాలు విసరనున్న పంత్-అయ్యర్.. సై అంటోన్న కొత్త సారథులు.. 10మంది కెప్టెన్లు వీరే..

IPL 2022: అయితే మిగతా జట్లలోనూ పూర్తిగా సారథులుగా క్లారిటీ రానప్పటికీ కొన్ని అంచానాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా 10 జట్ల కెప్టెన్లను ఓసారి చూద్దాం.

IPL 2022: రోహిత్-ధోనీలకు సవాలు విసరనున్న పంత్-అయ్యర్.. సై అంటోన్న కొత్త సారథులు.. 10మంది కెప్టెన్లు వీరే..
Ipl 10 Teams 10 Captains
Venkata Chari
|

Updated on: Feb 15, 2022 | 7:10 AM

Share

Tata IPL 2022 Auction: ఐపీఎల్ 2022 మెగా వేలం(IPL 2022) ముగిసిన తర్వాత, 10 జట్లు తమ స్క్వాడ్‌లను పూర్తి చేసుకున్నాయి. అదే సమయంలో, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా తమ కెప్టెన్ కోసం అన్వేషణను పూర్తి చేశాయి. ఐపీఎల్ 2022లో చెన్నై తరఫున నాలుగుసార్లు టైటిల్‌ను గెలుచుకున్న ధోనీ(MS Dhoni)తోపాటు ముంబైకి ఐదుసార్లు టైటిల్‌ అందించిన రోహిత్ శర్(Rohit Sharma)మకు వీరు సవాలు చేసే అవకాశం ఉంది. శ్రేయాస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ టీం దక్కించుకుంది. దీంతో కేకేఆర్ టీంకు కొత్త సారథిగా శ్రేయాస్ అయ్యర్ ఎన్నికవనున్నాడు.

పంత్ గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్‌కు బాధ్యతలు చేపట్టాడు. ఇటువంటి పరిస్థితిలో, ధోనీ, రోహిత్‌లకు ఇద్దరు యువ కెప్టెన్లు అయ్యర్, పంత్ సవాలు విసిరే అవకాశం ఉంది. అయితే మిగతా జట్లలోనూ పూర్తిగా సారథులుగా క్లారిటీ రానప్పటికీ కొన్ని అంచానాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా 10 జట్ల కెప్టెన్లను ఓసారి చూద్దాం.

పంజాబ్ కింగ్స్ – శ్రీలంక పర్యటనలో వన్డే, టీ20 సిరీస్ లలో టీమిండియా రెండో జట్టుకు నాయకత్వం వహించిన శిఖర్ ధావన్‌ను పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. తొలి రౌండ్‌లో ధావన్‌ను పంజాబ్ రూ. 8.25 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, కేఎల్ రాహుల్ పంజాబ్ నుంచి నిష్క్రమించిన తర్వాత, శిఖర్‌కు కమాండ్ ఇవ్వవచ్చని భావిస్తున్నారు. ధావన్ ఐపీఎల్‌లో 192 మ్యాచ్‌లు ఆడి 34.63 సగటుతో 5783 పరుగులు చేశాడు. దీనితో పాటు పొట్టి ఫార్మాట్‌లో ధావన్ పేరు మారుమ్రోగిపోతుంది. ప్రశాంతంగా కనిపిస్తూనే బ్యాటింగ్‌లో మాత్రం దుమ్ము దులిపేస్తుంటాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – విరాట్ తర్వాత, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌ను చేసే అవకాశం ఉంది. బెంగళూరు ఫాఫ్ డు ప్లెసిస్‌ని రూ.7 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్‌లో 100 మ్యాచ్‌లు ఆడిన డు ప్లెసిస్ 34.94 సగటుతో 2935 పరుగులు చేశాడు. కెప్టెన్సీ రేసులో ఫాఫ్ డు ప్లెసిస్ ముందంజలో ఉన్నాడని జట్టుకు ఎంపికైన హర్షల్ పటేల్ కూడా ఓ ఇంటర్వ్యూలో అంగీకరించాడు. చాలా కాలం పాటు దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా కూడా పనిచేసిన అతనికి ఐపీఎల్‌లో కూడా చాలా అనుభవం ఉంది.

కోల్‌కతా నైట్ రైడర్స్.. శ్రేయాస్ కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ కోసం అన్వేషణను పూర్తి చేశాడు. అయ్యర్‌ను KKR రూ. 12.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో, ఈ ఫ్రాంచైజీ IPL 2021 ఫైనల్ ఆడింది. కానీ, కెప్టెన్ మాత్రం ఫాంలో లేడు. అదే సమయంలో, అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అయ్యర్ తన సత్తా చూపించాడు. అతని కెప్టెన్సీలో తొలిసారిగా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్, ఫైనల్స్‌కు చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో అయ్యర్‌కు కేకేఆర్‌ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించవచ్చని భావిస్తున్నారు. ఐపీఎల్‌లో 87 మ్యాచ్‌లు ఆడిన అయ్యర్ 31.67 సగటుతో 2375 పరుగులు చేశాడు.

ముంబై ఇండియన్స్ – రోహిత్ శర్మ కెప్టెన్సీలో , ముంబై ఇండియన్స్ 5 సార్లు IPL టైటిల్ గెలుచుకుంది. IPL 2013లో సీజన్ మధ్యలో రికీ పాంటింగ్ స్థానంలో హిట్‌మాన్ ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అప్పటి నుంచి అతను ముంబైని 5 సార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు. 9 సీజన్లలో జట్టుకు నాయకత్వం వహించాడు. హిట్‌మ్యాన్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ 129 మ్యాచ్‌లు ఆడి 75 విజయాలు సాధించింది. ముంబై జట్టు 50 మ్యాచుల్లో ఓటమిని చవిచూసింది. ముంబై 2013, 2015, 2017, 2019, 2020లో ఐపీఎల్‌ను గెలుచుకుంది.

చెన్నై సూపర్ కింగ్స్ – మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు సార్లు టైటిల్ గెలుచుకుంది. అతని కెప్టెన్సీలో, CSK IPL మాత్రమే కాకుండా ప్రపంచంలో అత్యంత విజయవంతమైన T20 జట్టుగా కూడా ఉంది. 2010, 2011లో వరుసగా రెండుసార్లు ఐపీఎల్‌ విజేతగా ఆ జట్టు రికార్డు సృష్టించింది. అదే సమయంలో, 2021లో, జట్టు నాలుగోసారి టైటిల్ గెలుచుకుంది. ధోనీ కెప్టెన్సీలో CSK 213 మ్యాచ్‌లు ఆడి 130 విజయాలు సాధించింది. అలాగే ఆ జట్టు 81 మ్యాచుల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

ఢిల్లీ క్యాపిటల్స్ – గతేడాది శ్రేయాస్ అయ్యర్ గాయపడటంతో రిషబ్ పంత్‌కు ఢిల్లీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. జట్టు ప్రదర్శన చాలా బాగుంది. పంత్ కెప్టెన్సీలో ఢిల్లీ 16 మ్యాచ్‌లు ఆడగా 9 మ్యాచ్‌లు గెలిచింది. వీటిలో జట్టు 7 మ్యాచుల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. వేలంలో జట్టుకు ఇంకా రూ.47.50 కోట్లు మిగిలి ఉన్నాయి.

రాజస్థాన్ రాయల్స్- సంజూ శాంసన్‌ను గత ఏడాది రాజస్థాన్ దాని కెప్టెన్‌గా నియమించింది. ఐపిఎల్ 2022లో కూడా జట్టు కెప్టెన్‌గా సంజునే ఉండనున్నాడు. గత సీజన్‌లో రాజస్థాన్ జట్టు పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. ఈ జట్టు చివరిసారిగా 2018లో ప్లేఆఫ్ మ్యాచ్ ఆడింది. శాంసన్ ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లకు సారథ్యం వహించగా, ఆ జట్టు 5 మ్యాచ్‌ల్లో గెలిచి 9 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ – హైదరాబాద్ 2016లో ఒక్కసారి మాత్రమే టోర్నీని గెలుచుకోగలిగింది. ఈసారి కూడా కేన్ విలియమ్సన్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. గతేడాది ఆ జట్టు 14 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌లు మాత్రమే గెలవగా, 11 మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

లక్నో సూపర్ జెయింట్స్- లక్నో జట్టు తొలిసారి ఐపీఎల్‌లోకి అడుగుపెట్టనుంది. లక్నోకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తాడు. అంతకుముందు పంజాబ్ కింగ్స్‌కు రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతను రెండు సీజన్లలో పంజాబ్‌కు నాయకత్వం వహించాడు. రెండు సార్లు జట్టు ఆరో స్థానంలో నిలిచింది. కేఎల్ 27 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించగా, 14 మ్యాచ్‌ల్లో ఓటమిని ఎదుర్కొన్నాడు.

గుజరాత్ టైటాన్స్ – గుజరాత్ జట్టు తొలిసారి ఐపీఎల్‌లోకి అడుగుపెట్టనుంది. హార్దిక్ పాండ్యాను గుజరాత్ రూ. 16 కోట్లకు చేర్చుకుంది. పాండ్యా ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్‌తో జతకట్టాడు. ఐపీఎల్‌లో తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 92 మ్యాచ్‌లు ఆడిన అతను 27.33 సగటుతో 1476 పరుగులు చేశాడు.

Also Read: IPL 2022:14 కోట్ల కంటే తక్కువైనా పర్వాలేదు.. కానీ అదే జట్టుకి ఆడాలని అనుకున్నా..?

Ipl 2022 Auction: యశ్‌.. కంగారు పడకు.. ఈసారి నేను క్రీజులోనే ఉన్నాను.. అశ్విన్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌ పలికిన బట్లర్‌..