IPL 2022 Auction: ఐపీఎల్ 2022లో ఈ స్పెషల్ బంధాలకు బ్రేకులు.. జాబితాలో నిలిచిన స్నేహితులు ఎవరంటే?

ప్రస్తుతం వేలం ముగియడంతో, ఆటగాళ్లందరిపై శ్రద్ధ వహించిన అభిమానులు తమ అభిమాన జట్ల నుంచి కొన్ని కాంబోలను కూడా మిస్ అవుతున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.

Venkata Chari

|

Updated on: Feb 15, 2022 | 7:40 AM

IPL 2022 Auction: రెండు రోజుల వేలం తరువాత అన్ని జట్లలో లెక్కలు మారాయి. 600 మంది ఆటగాళ్లు 10 జట్లతో నిర్వహించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 మెగా వేలం ముగిసింది. కొందరికి ఎంపిక కావడం గొప్ప అవకాశం అయితే, మరికొందరికి మాత్రం అమ్ముడుకాక పోవడంతో నిరాశను మిగిల్చింది. ప్రస్తుతం వేలం ముగియడంతో, ఆటగాళ్లందరిపై శ్రద్ధ వహించిన అభిమానులు తమ అభిమాన జట్ల నుంచి కొన్ని కాంబోలను కూడా మిస్ అవుతున్నారు. వారువరో ఇప్పుడు చూద్దాం.

1 / 6
1. ఏబీ డివిలియర్స్- విరాట్ కోహ్లీ: దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్ అన్ని రకాల క్రికెట్‌ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. 37 ఏళ్ల ఏబీడీ అప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అయితే రైట్ హ్యాండర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కోసం IPLతో సహా వివిధ టీ20 లీగ్‌లలో ఆడటం కొనసాగించాడు. ఈ వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ముఖ్యంగా అతని సహచరుడు, సన్నిహితుడు విరాట్ కోహ్లీని కూడా తెగ బాధించింది. ఈ వార్తలపై స్పందిస్తూ, మాజీ RCB కెప్టెన్ ABDకి తన శుభాకాంక్షలు కూడా పంపంచాడు. "మా కాలంలోని అత్యుత్తమ ఆటగాడికి,  నేను కలుసుకున్న అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తికి, మీరు ఆర్‌సీబీకి అందించిన సేవలకు చాలా గర్వపడుతున్నాను. మన బంధం ఆటకు మించినది. ఎల్లప్పుడూ ఉంటుంది" అని కోహ్లీ రాసుకొచ్చాడు. ఐపీఎల్ ఖచ్చితంగా మిస్టర్ 360తో విరాట్ కోహ్లీ బంధాన్ని కూడా కోల్పోతుంది.

2 / 6
2. కృనాల్ పాండ్యా-హార్దిక్ పాండ్యా: పాండ్యా బ్రదర్స్ (కృనాల్, హార్దిక్) చాలా కాలంగా ముంబై ఇండియన్స్ (MI)లో అంతర్భాగంగా ఉన్నారు. ఇద్దరు ఆటగాళ్లు ముంబై నుంచి తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే, వారు ఇతర జట్లకు ఆడటం ఇదే మొదటిసారి కావడం విశేషం. హార్దిక్ పాండ్యను గుజరాత్ జెయింట్స్ రిటెన్షన్‌లో భాగంగా ఎంచుకుంది. జట్టు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కృనాల్ పాండ్యాను లక్నో సూపర్ జెయింట్స్ (LSG) వేలంలో కొనుగోలు చేసింది. దీంతో ఈ ఇద్దరు బ్రదర్స‌ కొత్త IPL జట్లలో చేరనున్నారు.

3 / 6
3. కేఎల్ రాహుల్-మయాంక్ అగర్వాల్: కర్ణాటకకు చెందిన బెస్ట్-ఫ్రెండ్స్ కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ పంజాబ్ కింగ్స్ (PBKS) బ్యాటింగ్ యూనిట్‌కు వెన్నెముకగా నిలిచారు. అయితే, IPL 2022 రిటెన్షన్‌కు ముందు, రాహుల్ తన ఫ్రాంచైజీకి పంజాబ్‌తో కొనసాగడం ఇష్టం లేదంటూ రిలీజ్ అయ్యాడు. తరువాత అతన్ని లక్నో ఫ్రాంచైజీ ఎంపిక చేసింది. లక్నో కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను ఎంచుకుంది. పంజాబ్ ఇంకా తమ సారథిని ప్రకటించలేదు. మయాంక్ అగర్వాల్ ప్రస్తుతం మరో ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కనిపించనున్నాడు. అయితే ఖచ్చితంగా IPL 2022లో వేర్వేరు జట్లకు ఇద్దరు ప్రాణ స్నేహితులు ఆడటంతో పోటీ ఎలా ఉండనుందో చూడాలి.

4 / 6
4. ఎంఎస్ ధోని-సురేష్ రైనా: IPL 2022 మెగా వేలంలో అమ్ముడుపోని పెద్ద పేర్లలో భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఒకరు. మొదటి రోజు అమ్ముడుపోకుండా పోయిన తర్వాత, రూ. 2 కోట్ల బేస్ ధర ఉన్న వెటరన్ బ్యాటర్‌ను చివరి రోజు కూడా ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. ఐపీఎల్ వేలంలో రైనా తొలిసారి అమ్ముడుకాలేదు. 2008లో పోటీ ప్రారంభమైనప్పటి నుంచి రైనా మిస్ అవుతున్న రెండవ IPL సీజన్ ఇది. 2020లో వ్యక్తిగత కారణాల వల్ల UAE నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. దీంతో ఆ టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ MS ధోనీతో అతను పంచుకున్న బలమైన బంధానికి ఇది ముగింపు అవుతుంది. 'చిన్న తలా' అని పిలిచే రైనా అనేక సందర్భాల్లో ధోనీ పట్ల తన విధేయతను నిరూపించుకున్నాడు. అంతర్జాతీయ రిటైర్మెంట్‌ను ధోని ప్రకటించిన రోజునే సురేష్ రైనా కూడా షాకింగ్ న్యూస్ చెప్పి ధోనిపై ఉన్న అభిమానాన్ని చూపించాడు.

5 / 6
5. డేవిడ్ వార్నర్-రషీద్ ఖాన్: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) గురించి మాట్లాడితే, జట్టు ఎల్లప్పుడూ తమ ప్రధాన స్టార్లుగా ఉన్న ఇద్దరు ముఖ్యమైన ఆటగాళ్లను కోల్పోయింది. అందులో ఒకరు స్పిన్నర్ రషీద్ ఖాన్ కాగా, మరొకరు బ్యాటర్ డేవిడ్ వార్నర్. హైదరాబాద్‌కు ఆడుతున్నప్పుడు రషీద్ అంతర్జాతీయ క్రికెట్‌పై ఆధిపత్యం చెలాయించాడు. అదే సమయంలో, వార్నర్ 2013 నుంచి ఈ జట్టుతో అనుబంధం కలిగి ఉన్నాడు. 2016లో జట్టును ఛాంపియన్‌గా చేశాడు. అయినప్పటికీ, 2020 ఎడిషన్‌లో వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించి, వార్నర్‌తో ప్రవర్తించిన తీరుతో అభిమానులను కూడా తీవ్ర విమర్శలు చేశారు. తరువాత రిటెన్షన్‌ ప్రక్రియలోనూ రషీద్ ఖాన్‌ను ఉంచలేదు. తరువాత రషీద్‌ను లక్నో ఫ్రాంచైజీ దక్కించుకుంది. అలాగే వేలంలో వార్నర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. దీంతో వీరి బంధం కూడా ముగిసిపోయింది.

6 / 6
Follow us