T20 World Cup 2021: స్కాట్లాం‎డ్‎పై ఆఫ్ఘాన్ ఘన విజయం.. రాణించిన రెహమాన్, రషీద్ ఖాన్..

టీ20 ప్రపంచకప్‌లోని సూపర్ 12 మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై ఆఫ్ఘానిస్తాన్ 130 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముజీబ్ ఉర్ రెహమాన్, రషీద్ ఖాన్ ప్రత్యర్థి బ్యాట్స్‎మెన్స్‎కు చుక్కలు చూపించారు...

T20 World Cup 2021: స్కాట్లాం‎డ్‎పై ఆఫ్ఘాన్ ఘన విజయం.. రాణించిన రెహమాన్, రషీద్ ఖాన్..
Scotland
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 26, 2021 | 6:46 AM

టీ20 ప్రపంచకప్‌లోని సూపర్ 12 మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై ఆఫ్ఘానిస్తాన్ 130 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముజీబ్ ఉర్ రెహమాన్, రషీద్ ఖాన్ ప్రత్యర్థి బ్యాట్స్‎మెన్స్‎కు చుక్కలు చూపించారు. సోమవారం షార్జాలో జరిగిన మ్యాచ్‎లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన స్కాట్లాం‎డ్‎ను 10.2 ఓవర్లలో కేవలం 60 పరుగులకే ఆలౌట్ అయింది.

స్కాట్లాండ్ మొదటి మూడు ఓవర్లలో 27 పరుగులు చేసి బాగానే ఆడుతున్నట్లు కనిపించింది. కానీ ముజీబ్ బౌలింగ్‎కు రావడంతో కథ మారింది. కోయెట్జర్, కాలమ్ మెక్‌లోడ్ వరుస బంతుల్లో ఔట్ చేశాడు.  మరో రెండు బంతుల తర్వాత అతను రిచీ బెరింగ్టన్‌ను కూడా పెవిలియన్‎కు చేర్చాడు. దీంతో స్కాట్లాండ్ నాలుగు ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసి కష్టల్లో పడింది. ఆ తర్వాత ఆ జట్ట ఏ దశలోనూ ప్రతిఘటించలేదు. తర్వాతి రెండు ఓవర్లలో మాథ్యూ క్రాస్, జార్జ్ మున్సీ (25) నిష్క్రమించడంతో స్కాట్లాండ్‌కు వికెట్ల పతనం కొనసాగింది. మైఖేల్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్‎ను కూడా రషీద్ ఖాన్, ముజీబ్ ఔట్ చేశారు. దీంతో స్కాట్లాం‎డ్ 60 పరుగులకే ఆలౌట్ అయింది. ముజీబ్ ఉర్ రెహమాన్ 5, రషీద్ ఖాన్ 4 వికెట్లు తీశారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్ నజీబుల్లా జద్రాన్ 34 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 59 పరుగులు చేశాడు. హజ్రతుల్లా జజాయ్ 44, రహ్మానుల్లా గుర్బాజ్ 46 రాణించండంతో 190 పరుగులు చేసింది. టీ20 వరల్డ్ కప్‎లో ఆఫ్ఘానిస్తాన్‎కు ఇదే అత్యుత్తమ స్కోరు. స్కాట్లాం‎డ్ 60 పరుగులకే ఆలౌట్ కావటంతో ఆప్ఘాన్ 130 పరుగులు భారీ తేడాతో గెలుపొందింది.

Read Also.. IPL 2022: రూ. 56 వేల కోట్లు.. 3 లక్షల మందికిపైగా ఉద్యోగులు.. CVC Capital Partners గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే..!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!