టీ20 ప్రపంచకప్‌లో భారీ మార్పులు.. పోటీలో 20 జట్లు.. క్వాలిఫైయర్ మ్యాచ్‌లకు గుడ్‌బై.. కొత్త ఫార్మాట్ ఎలా ఉందంటే?

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో టైటిల్ కోసం 20 జట్లు పోటీపడనున్నాయి. ఇప్పటికే 12 టీమ్‌లు ఖారారయ్యాయి. మిగతా టీంలు ఏవనేది తెలియాలంటే మాత్రం..

టీ20 ప్రపంచకప్‌లో భారీ మార్పులు.. పోటీలో 20 జట్లు.. క్వాలిఫైయర్ మ్యాచ్‌లకు గుడ్‌బై.. కొత్త ఫార్మాట్ ఎలా ఉందంటే?
Team India
Follow us

|

Updated on: Nov 21, 2022 | 3:50 PM

ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ 2022 టైటిల్ గెలుచుకుంది. 16 జట్లు పోటీపడిన ఈ పొట్టి ప్రపంచ కప్‌ను ఎట్టకేలకకు ఇంగ్లీష్ జట్టు అత్యుత్తమ ఆటతో ప్రపంచ ఛాంపియన్‌గా మారింది. అయితే ఇప్పుడు వచ్చే సీజన్‌లో ఈ ఫార్మాట్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచేందుకు 16 నుంచి 20 జట్ల మధ్య పోటీ జరగనుంది. 2024లో టీ20 ప్రపంచ కప్ యూఎస్ఏ, వెస్టిండీస్‌లో నిర్వహించనున్నారు. ప్రపంచ కప్ తదుపరి సీజన్ కోసం టోర్నమెంట్‌లో పెద్ద మార్పు జరగనుంది. వచ్చే సీజన్‌లో 20 జట్ల మధ్య పోటీ ఉండనుంది. ఇది మాత్రమే కాదు, తదుపరి సీజన్ క్వాలిఫయర్‌లు కూడా ఆడవు. తొలిసారిగా అమెరికాలో భారీ క్రికెట్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

ఆతిథ్య జట్టుగా అమెరికా, వెస్టిండీస్‌లు నేరుగా టోర్నీకి అర్హత సాధిస్తాయి. 20 జట్ల టోర్నమెంట్ నాకౌట్‌లకు ముందు రెండు దశల్లో నిర్వహించనున్నారు. అయితే ఈ దశ 2021, 2022లో ఆడిన మొదటి రౌండ్ లేదా సూపర్ 12 ఫార్మాట్‌కు భిన్నంగా ఉంటుంది. అన్ని జట్లను 4 గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో 5 జట్లు ఉంటాయి. ప్రతి గ్రూప్‌లోని టాప్ 2 జట్లు సూపర్ 8లోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ 8 జట్లను 2 గ్రూపులుగా విభజిస్తారు. రెండు గ్రూపుల్లో టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌లోకి ప్రవేశిస్తాయి.

జట్టు అర్హత పద్ధతి
వెస్ట్ ఇండీస్ హోస్ట్
అమెరికా హోస్ట్
ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ 2022 ఛాంపియన్
పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్ 2022 రన్నరప్
న్యూజిలాండ్ టీ20 ప్రపంచ కప్ 2022 సెమీ ఫైనలిస్టులు
భారతదేశం టీ20 ప్రపంచ కప్ 2022 సెమీ ఫైనలిస్టులు
ఆస్ట్రేలియా 2022 టీ20 ప్రపంచకప్‌లో టాప్ 8 ర్యాంక్‌లో నిలిచింది
నెదర్లాండ్స్ 2022 టీ20 ప్రపంచకప్‌లో టాప్ 8 ర్యాంక్‌లో నిలిచింది
దక్షిణ ఆఫ్రికా 2022 టీ20 ప్రపంచకప్‌లో టాప్ 8 ర్యాంక్‌లో నిలిచింది
శ్రీలంక 2022 టీ20 ప్రపంచకప్‌లో టాప్ 8 ర్యాంక్‌లో నిలిచింది
ఆఫ్ఘనిస్తాన్ నవంబర్ 14న టీ20 ర్యాంకింగ్స్‌లో తదుపరి అత్యుత్తమ జట్టు
బంగ్లాదేశ్ నవంబర్ 14న టీ20 ర్యాంకింగ్స్‌లో తదుపరి అత్యుత్తమ జట్టు

జట్టు ఎలా అర్హత సాధిస్తాయంటే?

టీ20 ప్రపంచ కప్ 2024 ప్రారంభ 2 స్థానాలు ఇప్పటికే ఆతిథ్య వెస్టిండీస్, USA కోసం రిజర్వ్ అయ్యాయి. ఇక 2022 ప్రపంచ కప్ ప్రదర్శన, నవంబర్ 14 వరకు ICC T20 ర్యాంకింగ్స్ ఆధారంగా తదుపరి 10 జట్లను నిర్ణయించనున్నారు. అంటే ఇప్పటికే 10 టీమ్‌లను ఖరారు చేశారు.

ఇవి కూడా చదవండి

అలాగే ప్రాంతీయ అర్హత ఆధారంగా తదుపరి 8 జట్లను నిర్ణయిస్తారు. ఆఫ్రికా, ఆసియా, యూరప్‌లు ఒక్కొక్కటి రెండు క్వాలిఫికేషన్ స్పాట్‌లను కలిగి ఉండగా, అమెరికా, తూర్పు ఆసియా పసిఫిక్‌లు ఒక్కో స్థానాన్ని కలిగి ఉన్నాయి. ప్రాంతీయ క్వాలిఫికేషన్‌లో గెలిచిన జట్టు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్ వంటి జట్ల గ్రూప్‌లో చోటు దక్కించుకుంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు