- Telugu News Photo Gallery Cricket photos Sania mirza and shoaib malik seen together 1st time since divorce rumours on social media
Sania Mirza – Shoaib Malik: ఆ వార్తలకు చెక్ పెట్టేందుకేనా.. తొలిసారి జంటగా కనిపించిన షోయబ్, సానియా..
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడిపోయారనే వార్తలు గత కొన్ని రోజులుగా హెడ్‌లైన్స్‌లో ఉన్నాయి. విడాకుల వార్తల మధ్య, ఇద్దరూ కలిసి మొదటిసారి కనిపించారు.
Updated on: Nov 21, 2022 | 3:09 PM

ప్రస్తుతం భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పేర్లు నిరంతరం సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా షోయబ్, సానియాల 12 ఏళ్ల బంధం తెగిపోయిందని వార్తలు కూడా వచ్చాయి. ఇద్దరూ విడివిడిగా జీవిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి.

విడాకుల వార్తల మధ్య, షోయబ్, సానియా మొదటిసారి కలిసి కనిపించారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. వాస్తవానికి, ఈ స్టార్ జంట త్వరలో పాకిస్థానీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో కలిసి టెలివిజన్ షోను హోస్ట్ చేయనున్నారు. షో సెట్ నుంచి వచ్చిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

షోయబ్, సానియా కలిసి చూడడం పట్ల అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి మధ్య అంతా బాగానే ఉండాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు. ఇదంతా షోను ప్రమోట్ చేసేందుకు చేసిన పబ్లిసిటీ స్టంట్ అని కొందరు యూజర్లు అంటున్నారు.

కొన్ని రోజుల క్రితం, షోయబ్ సానియాతో తన రొమాంటిక్ చిత్రాన్ని పంచుకున్నాడు. ఆమె 36వ పుట్టినరోజు సందర్భంగా భారత స్టార్‌కి శుభాకాంక్షలు తెలిపాడు.

అయితే, ఈ పోస్ట్‌పై స్పందించలేదు. ఇది పుకార్లకు మరింత ఊతమిచ్చింది. మరి ఇంతటితోనైనా ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.




