- Telugu News Photo Gallery Cricket photos Narayan jagadeesan 5 consecutive hundreds and double century against arunachal pradesh in vijay hazare trophy
76 బంతుల్లో సెంచరీ.. 38 బంతుల్లో డబుల్ సెంచరీ.. వరుసగా 5 శతకాలతో ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టిన ధోని మాజీ టీంమేట్..
Narayan Jagadeesan: తమిళనాడు ఓపెనర్ నారాయణ్ జగదీశన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో వరుసగా ఐదు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
Updated on: Nov 21, 2022 | 2:16 PM

రికార్డులు బద్దలు కొట్టాలని అంతా అనుకుంటుంటారు. అచ్చం ఇదే గురితో ఓ బ్యాటర్ ప్రస్తుతం క్రికెట్‌లో సంచలనంగా మారాడు. తమిళనాడు ఓపెనర్ నారాయణ్ జగదీశన్ ప్రస్తుతం క్రికెట్‌లో భారీ రికార్డులు నెలకొల్పుతూ దూసుకపోతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేసి నారాయణ్ జగదీశన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.

నారాయణ్ జగదీశన్ లిస్ట్ A క్రికెట్‌లో వరుసగా ఐదు సెంచరీలు సాధించిన ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా నిలిచాడు. అదే సమయంలో అతను విజయ్ హజారే ట్రోఫీ ఒకే సీజన్‌లో 4 సెంచరీల రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఈ విషయంలో జగదీసన్ విరాట్ కోహ్లీని కూడా వెనక్కునెట్టాడు.

నారాయణ్ జగదీశన్ తుఫాన్ డబుల్ సెంచరీ సాధించి ఈ రికార్డు సృష్టించాడు. అరుణాచల్ ప్రదేశ్ పై జగదీషన్ కేవలం 114 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించాడు.

నారాయణ్ జగదీశన్ తన సెంచరీని 76 బంతుల్లో పూర్తి చేశాడు. ఆ తర్వాతి 38 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసింది. జగదీసన్ గతంలో హర్యానా, గోవా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రలపై సెంచరీలు సాధించాడు.

నారాయణ్ జగదీసన్ ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రిలీజ్ అయ్యాడు. 2018లో చెన్నై జట్టులో చేరిన ఈ ఆటగాడు 4 సీజన్లలో 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. అతనికి వరుసగా అవకాశాలు రాలేదు. కానీ ప్రస్తుతం ఈ ఆటగాడు తన ఆటను వేరే స్థాయికి తీసుకెళ్లాడు. డిసెంబర్‌లో జరగనున్న IPL వేలంలో ఈ ఆటగాడిపై చాలా జట్లు భారీగా పోటీపడగలవని భావిస్తున్నారు.




