AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ఛాంపియన్ జట్టుపై ప్రశంసలు.. ప్రధానితో సహా శుభాకాంక్షలు తెలిపిన మాజీ క్రికెటర్లు

T20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో, భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి దక్షిణాఫ్రికాను ఓడించింది. ఈ విజయంతో 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత భారత క్రికెట్ జట్టుకు అభినందనలు వెల్లువెత్తాయి. ఆటతో అనుబంధం ఉన్న పలువురు అనుభవజ్ఞులతోపాటు, భారత ప్రధాని నరేంద్ర మోడీ తమదైన ప్రత్యేక శైలిలో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. రోహిత్ సేనకు శుభాకాంక్షలు తెలిపారు.

Team India: ఛాంపియన్ జట్టుపై ప్రశంసలు.. ప్రధానితో సహా శుభాకాంక్షలు తెలిపిన మాజీ క్రికెటర్లు
Team India Pm Modi Sachin
Venkata Chari
|

Updated on: Jun 30, 2024 | 9:07 AM

Share

T20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో, భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి దక్షిణాఫ్రికాను ఓడించింది. ఈ విజయంతో 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత భారత క్రికెట్ జట్టుకు అభినందనలు వెల్లువెత్తాయి. ఆటతో అనుబంధం ఉన్న పలువురు అనుభవజ్ఞులతోపాటు, భారత ప్రధాని నరేంద్ర మోడీ తమదైన ప్రత్యేక శైలిలో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. రోహిత్ సేనకు శుభాకాంక్షలు తెలిపారు.

టీమ్ ఇండియా విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, పీఎం నరేంద్ర మోడీ ఎక్స్‌లో ఓ వీడియో పోస్ట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తమదైన స్టైల్లో ట్రోఫీని మరోసారి ఇంటికి తీసుకొచ్చారు. భారత జట్టును చూసిన నేను గర్వపడుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు. అలాగే, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, టీమ్ ఇండియా జెర్సీవైపునకు మన దేశపు పిల్లలను వారి కలలకు ఒక అడుగు దగ్గరగా వెళ్లేలా ప్రేరేపిస్తుందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో రాసుకొచ్చారు.

రాహుల్ ద్రవిడ్ పట్ల చాలా సంతోషంగా ఉంది: సచిన్

2011 ప్రపంచకప్‌ను గెలుచుకోలేకపోయినా.. నేడు తన కలను నేరవేర్చుకున్న నా స్నేహితుడు రాహుల్ ద్రవిడ్‌ను చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను, అయితే ఈ T20 ప్రపంచకప్ విజయంలో అతని సహకారం చాలా పెద్దదంటూ సచిన్ పొగడ్తల వర్షం కురిపించాడు. అలాగే, రోహిత్ శర్మను ప్రశంసిస్తూ, అద్భుతమైన కెప్టెన్సీ అంటూ పొగిడేశాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఓటమిని వదిలిపెట్టి, టీ20 ప్రపంచకప్ కోసం మన ఆటగాళ్లందరినీ ఉత్సాహపరిచేలా చేయడం అభినందనీయం. బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్, విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు పొందడంపై, ఇద్దరూ వాటికి అర్హులంటూ కొనియాడారు.

అభినందనలు తెలిపిన క్రికెటర్లు..

టీ20 ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన టీమ్‌ఇండియాకు నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ అభినందనలు తెలిపారు. చివరి ఐదు ఓవర్లలో అద్భుతమైన ప్రదర్శన చేసిన ప్రతి ఆటగాడు అభినందనలకు అర్హుడని చెప్పాడు. కాగా స్పిన్నర్, 2011 ప్రపంచకప్ విజేత రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ మేం ఛాంపియన్లమయ్యాం. మాజీ కెప్టెన్, కోచ్ అనిల్ కుంబ్లే ఎక్స్‌లో టీమ్ ఇండియాకు అభినందనలు, గొప్ప విజయం అంటూ తెలిపాడు. ఇది నా ఇండియా, మేం ఛాంపియన్లమని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. టీమ్ ఇండియాను చూసి దేశం గర్విస్తోందని తెలిపాడు.

అద్భుతమైన బహుమతికి ధన్యవాదాలు: ధోని

మహేంద్ర సింగ్ ధోనీ ఇన్‌స్టాగ్రామ్‌లో వరల్డ్ కప్ ఛాంపియన్ 2024 అంటూ రాసుకొచ్చాడు. నా గుండె చప్పుడు పెరిగింది, కానీ జట్టు ప్రశాంతంగా ఉండటం, ఆత్మవిశ్వాసాన్ని కొనసాగించడం ద్వారా అద్భుతమైన ప్రదర్శన చేసింది. ప్రపంచ కప్‌ను ఇంటికి తీసుకువచ్చినందుకు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరి తరపున అభినందనలు అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. కాగా, వచ్చే నెలలో ధోనీకి 43 ఏళ్లు రానున్నాయి.

ఎంత గొప్ప విజయం..

2011 వన్డే ప్రపంచకప్ విజయం సాధించిన హీరో యువరాజ్ సింగ్ ట్వీట్ చేస్తూ.. చివరకు నువ్వే చేశావు. హార్దిక్ పాండ్యా నువ్వు హీరోవి. జస్ప్రీత్ బుమ్రా ఒక్క ఓవర్లో భారత్‌ను మళ్లీ మ్యాచ్‌లోకి తీసుకొచ్చాడు. రోహిత్ శర్మ పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని కూడా చెప్పుకొచ్చాడు. కోహ్లీ, ద్రవిడ్‌తో పాటు మొత్తం జట్టుకు అభినందనలు. సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ, రోహిత్ శర్మ, జట్టుకు అభినందనలు, ఎంత అద్భుతమైన విజయం. బుమ్రా చేసిన అద్భుతమైన ప్రదర్శన అంటూ రాశాడు. విరాట్, అక్షర్, హార్దిక్ అందరూ బాగా ఆడారు. రాహుల్ ద్రవిడ్, సహాయక సిబ్బందికి అభినందనలు తెలిపారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..