- Telugu News Photo Gallery Cricket photos Virat Kohli And Rohit Sharma Retirement From T20I Cricket After T20I World Cup 2024 Final Match Winning against south africa
Virat Kohli – Rohit Sharma: టీమిండియాలో ముగిసిన మరో శకం.. ట్రోఫీని ముద్దాడుతూ కన్నీటితో ‘రో-కో’ వీడ్కోలు
Virat Kohli – Rohit Sharma: 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఈ ప్రపంచకప్ విజయం తర్వాత, టీ20 అంతర్జాతీయ కెరీర్‌కు టీమ్ ఇండియాలోని ఇద్దరు ప్రముఖులు ఒకేసారి వీడ్కోలు పలికి, ష్యాన్స్‌కు బిగ్ షాక్ ఇచ్చారు.
Updated on: Jun 30, 2024 | 8:30 AM

Virat Kohli – Rohit Sharma: టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీడ్కోలు పలికారు. ఒకే వేదికపై ఇద్దరూ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ చెప్పారు. దీంతో ఇద్దరు భారత దిగ్గజాల టీ20 కెరీర్ ముగిసినట్లైంది.

టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో అర్ధశతకం బాదిన విరాట్ కోహ్లికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ అవార్డు అందుకున్న అనంతరం కింగ్ కోహ్లీ మాట్లాడుతూ.. ఇదే నా చివరి టీ20 ప్రపంచకప్ టోర్నీ అని అన్నాడు. ఈ విజయంతో తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌కు స్వస్తి చెప్పాలనుకుంటున్నట్లు తెలిపాడు.

ప్రపంచకప్ తర్వాత మీడియా సమావేశంలో పాల్గొన్న రోహిత్ శర్మ మాట్లాడుతూ.. టీ20 మ్యాచ్‌తో భారత్ తరపున కెరీర్ ప్రారంభించాను. టీ20 అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికేందుకు ఇప్పటికంటే మంచి సమయం లేదు. అందుకే, ఈ తరహా క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు రోహిత్ శర్మ తెలిపాడు.

టీమిండియా తరుపున 125 టీ20 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ మొత్తం 117 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈసారి 3056 బంతులు ఎదుర్కొని 4188 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో 38 అర్ధసెంచరీలు, 1 సెంచరీ సాధించాడు.

రోహిత్ శర్మ టీమిండియా తరపున మొత్తం 159 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 151 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో 3003 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్ 4231 పరుగులు చేశాడు. 5 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు కూడా చేశాడు.

ఇప్పుడు ప్రపంచకప్ విజయంతో ఇద్దరు దిగ్గజాలు కలిసి తమ టీ20 అంతర్జాతీయ కెరీర్‌ను ముగించారు. అందువల్ల రానున్న రోజుల్లో భారత టీ20 జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కనిపించరు.




