IND vs AUS: ఓడినా, బలుపు ఏ మాత్రం తగ్గలేదుగా.. రోహిత్ సేనపై ఆసీస్ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
T20 World Cup 2024: ఆస్ట్రేలియన్ జట్టుకు ఓటమి ఎదురైనా.. ఆ ఆటగాళ్లకు పొగరు ఏమాత్రం తగ్గలేనట్టుంది. అన్ని విభాగాల్లోనూ తమకంటే బలహీనంగా ఉన్న అఫ్గానిస్థాన్ జట్టుపై ఘోరంగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమదాంలో పడిన కంగారూల (AFG vs AUS) దురహంకారం మాత్రం తగ్గడం లేదు. ఈరోజు జరిగిన టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2024) సూపర్ 8 రౌండ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో 21 పరుగుల తేడాతో ఘోర పరాజయం తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ మాటలు టీమిండియా అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి.

ఆఫ్ఘనిస్తాన్‌పై ఘోర పరాజయం..
ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఓటమి అనంతరం జరిగిన మ్యాచ్ ప్రజెంటేషన్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ మాట్లాడుతూ, ‘ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఈరోజు మాపై అద్భుత ప్రదర్శన చేసి మ్యాచ్ నుంచి మమ్మల్ని దూరం చేసింది. పిచ్ స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని టాస్ గెలిచిన చాలా జట్లు మొదట ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకుంటాయి. టాస్ గెలిచిన తర్వాత మొదట ఏమి చేయాలో నిర్ణయించుకోవాల్సిన కారణం ఇదే. కాబట్టి టాస్ గురించి పెద్దగా ఆలోచించలేదు. ఈరోజు మాది కాదు. పిచ్ రెండు జట్లకు ఫర్వాలేదు. అందుకే నేను మీకు ముందే చెప్పినట్లు ఈ మ్యాచ్‌లో ఓడిపోయాం’ అంటూ చెప్పుకొచ్చాడు.
భారత్ కంటే మెరుగైన జట్టు లేదు..
Mitchell Marsh said, “we need to win the next match, and there’s no better team to do it against”. pic.twitter.com/zTF3zTeQPy
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 23, 2024
మార్ష్ ఇప్పటి వరకు చెప్పిన మాటలు అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి. అయితే ఆ తర్వాత భారత్‌తో మ్యాచ్ గురించి మార్ష్ చెప్పిన మాటలు భారత అభిమానులకు కోపం తెప్పించాయి. నిజానికి ఆస్ట్రేలియా జట్టు తన డూ ఆర్ డై మ్యాచ్‌లో భారత జట్టుతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ గురించి మార్ష్ మాట్లాడుతూ.. నేటి మ్యాచ్‌లో ఓడిపోయినందున తర్వాతి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందేనని చెప్పుకొచ్చాడు. కాబట్టి గెలవడానికి భారత్ కంటే మెరుగైన జట్టు మాకు దొరకదు. టీమ్ ఇండియాపై మేం గెలవాలని కోరుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. మార్ష్ ప్రకటన టీమిండియాను ఓడిస్తామన్న అహంకారపూరితంగా మాట్లాడాడని అందరికీ తెలిసిందే.
కెప్టెన్‌గా మార్ష్ ప్రదర్శన..
ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా జట్టు మిచెల్ మార్ష్ నుంచి అత్యుత్తమ ఇన్నింగ్స్‌ను ఆశించింది. కానీ, మార్ష్ ప్రత్యర్థి జట్టుపై విజయవంతమైన ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ప్రత్యర్థిపై మూడవ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ, అతను తన జట్టు కోసం మొత్తం 9 బంతులు ఎదుర్కొన్నాడు. 133.33 స్ట్రైక్ రేట్‌తో కేవలం 12 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈసారి అతని బ్యాట్ నుంచి 2 బౌండరీలు మాత్రమే వచ్చాయి.