IND vs ENG మ్యాచ్‌కు వివాదాస్పద అంపైర్.. కివీస్‌ను కంటతడి పెట్టించిన ఆ నిర్ణయం.. రిపీటైతే టీమిండియాకు ఓటమే?
T20 World Cup Semi-finals 2022: టీ20 ప్రపంచకప్‌లో రెండు సెమీఫైనల్‌లు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్ పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య జరగనుండగా, రెండో సెమీఫైనల్ భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనుంది.
T20 World Cup Semi-finals 2022: టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ గురువారం అడిలైడ్‌లో భారత్-ఇంగ్లండ్(India vs England) జట్ల మధ్య జరగనుంది. ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ కోసమే ఎదురుచూస్తోంది. ఇది అంపైరింగ్‌పై కూడా ఆధారపడి ఉంటుందని ఇప్పుడు తెలిసింది. ఎందుకంటే ఈ ప్రపంచ కప్‌లోని రెండవ సెమీ-ఫైనల్‌లో పాల్గొనే అంపైర్లను తాజాగా ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో కుమార్ ధర్మసేన ఆన్-ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించున్నారు. ఈయన నిర్ణయాలలో ఒకదానితో ఇంగ్లాండ్ వన్డే ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. అది 2019లో జరిగింది. అలాంటి తప్పుడు నిర్ణయమే.. ఈ మ్యాచ్‌లోనూ జరిగితే.. టీమిండియాకు ఓటమి తప్పదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
2019 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగింది. అక్కడ ధర్మసేన ఓవర్‌త్రోలో 6 పరుగులను ఇచ్చాడు. ఇందులో అదనపు పరుగుల కారణంగా ఇంగ్లండ్ మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకువెళ్లింది. ఇద్దరి మధ్య రెండు సూపర్ ఓవర్లు జరిగాయి. రెండు సందర్భాలలో స్కోర్లు సమానంగా ఉండడంతో బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు. ఫైనల్ తర్వాత ధర్మసేన కూడా తన తప్పును అంగీకరించడం గమనార్హం.
సెమీ ఫైనల్స్‌కు అధికారిక టీం ఫిక్స్..
అయితే, మరోసారి ఇంగ్లండ్‌తో జరిగే బిగ్‌మ్యాచ్‌లో ధర్మసేన అంపైర్‌గా వ్యవహరించనున్నాడు. ధర్మసేనతో పాటు పాల్ రీఫిల్ కూడా ఆన్ ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించనున్నారు. క్రిస్ జెఫ్నీ థర్డ్ అంపైర్ పాత్రలో కనిపించనున్నాడు. రాడ్ టక్కర్ నాలుగో అంపైర్‌గా వ్యవహరిస్తారు. మ్యాచ్ రిఫరీగా డేవిడ్ మూన్ వ్యవహరిస్తారు. నవంబర్ 10న భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. అయితే అంతకు ముందు నవంబర్ 9న సిడ్నీలో న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ జరగనుంది.
ఐసీసీ అధికారిక ప్రకటన ఇదే..
ICC Officials for Semifinals –
?On field Umpires – Dharmasena and Paul Reiffell ? Third Umpire – Chris Gaffney ? 4th Umpire – Rod Tucker ? Referee – David Boon#T20WorldCup
— Abhijeet ♞ (@TheYorkerBall) November 7, 2022
పాకిస్థాన్-న్యూజిలాండ్ మ్యాచ్‌కు అంపైర్లు వీరే..
టీ20 ప్రపంచకప్‌లో మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఎరాస్మస్, రిచర్డ్ ఇంగ్లెవర్త్ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. రిచర్డ్ క్యాటిల్‌బరో థర్డ్ అంపైర్‌గా, మైఖేల్ గోఫ్ ఫోర్త్ అంపైర్‌గా వ్యవహరించనున్నారు. క్రిస్ బ్రాడ్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నాడు.
భారత్ గ్రూప్ 2లో టాపర్..
గ్రూప్ 1లో అగ్రస్థానంలో నిలిచిన న్యూజిలాండ్ జట్టు గ్రూప్ 2లో రెండో స్థానంలో నిలిచిన పాకిస్తాన్ జట్టుతో సిడ్నీలో తలపడనుంది. బంగ్లాదేశ్‌ను ఓడించి పాకిస్థాన్ సెమీస్‌లోకి ప్రవేశించింది. కాగా , గ్రూప్-2లో టీమ్ ఇండియా టాపర్‌గా నిలిచింది. ఇంగ్లిష్ జట్టు గ్రూప్ 1లో రెండో స్థానంలో నిలిచింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..