AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SKY : తండ్రిగా ప్రమోషన్ పొందిన టీమిండియా కెప్టెన్.. ఐపీఎల్ మధ్యలో ముంబై స్టార్ ఇంట్లో సంబరాలు

SKY : సూర్యకుమార్ యాదవ్‌కు 2026 సంవత్సరం ఎంతో కలిసివచ్చింది. ఇటీవల ఆయన కప్టెన్సీలోనే టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్‌ను ముద్దాడింది. అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్‌గా సక్సెస్ సాధించిన సూర్యకు, ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో తండ్రిగా బాధ్యతలు పెరిగాయి.

SKY : తండ్రిగా ప్రమోషన్ పొందిన టీమిండియా కెప్టెన్.. ఐపీఎల్ మధ్యలో ముంబై స్టార్ ఇంట్లో సంబరాలు
Suryakumar Yadav And Devisha
Rakesh
|

Updated on: May 07, 2026 | 7:03 PM

Share

SKY : టీమిండియా టీ20 కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ (SKY) ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న వేళ సూర్య దంపతులకు తీపి కబురు అందింది. సూర్యకుమార్ భార్య దేవిషా శెట్టి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ వార్త తెలియగానే సోషల్ మీడియా వేదికగా అభిమానులు, తోటి క్రికెటర్లు ఈ న్యూ పేరెంట్స్‎కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, దేవిషా శెట్టి 2016లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరిది కాలేజీ రోజుల్లో మొదలైన ప్రేమకథ. ముంబైలో చదువుకుంటున్న రోజుల్లో దేవిషా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌కు ఫిదా అయిన సూర్య, ఆ తర్వాత ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహమైన పదేళ్ల తర్వాత ఈ దంపతులు ఇప్పుడు తొలిసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఈ ఏడాది మార్చిలోనే దేవిషా బేబీ షవర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, అప్పటి నుంచి ఫ్యాన్స్ ఈ గుడ్ న్యూస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సూర్యకుమార్ యాదవ్‌కు 2026 సంవత్సరం ఎంతో కలిసివచ్చింది. ఇటీవల ఆయన కప్టెన్సీలోనే టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్‌ను ముద్దాడింది. అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్‌గా సక్సెస్ సాధించిన సూర్యకు, ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో తండ్రిగా బాధ్యతలు పెరిగాయి. మైదానంలో 360 డిగ్రీల షాట్లతో ప్రత్యర్థులను వణికించే సూర్య, తన కూతురి రాకతో జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు.

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఆడిన 10 మ్యాచ్‌లలో కేవలం 3 విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో వెనుకబడి ఉంది. మే 10న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాయ్‌పూర్‌లో ముంబై తలపడాల్సి ఉంది. అయితే భార్య ప్రసవం దృష్ట్యా సూర్య జట్టుతో కలిసి రాయ్‌పూర్ వెళ్లలేదని సమాచారం. దీంతో ఆర్సీబీతో జరిగే కీలక మ్యాచ్‌కు సూర్య దూరం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన కుటుంబంతో గడపాలని సూర్య భావిస్తుండటంతో మేనేజ్‌మెంట్ కూడా అందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
సూర్య కెప్టెన్సీ పోస్ట్ పీకేసిన గంభీర్.. కొత్తగా సారథి ఎవరంటే?
సూర్య కెప్టెన్సీ పోస్ట్ పీకేసిన గంభీర్.. కొత్తగా సారథి ఎవరంటే?
బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్నిపెంచిన కేంద్ర ప్రభుత్వం
బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్నిపెంచిన కేంద్ర ప్రభుత్వం
ఎవరూ చేయని త్యాగం.. కలెక్టర్ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న తల్లి..
ఎవరూ చేయని త్యాగం.. కలెక్టర్ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న తల్లి..
ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పప్పులు తప్పక తినండి!
ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పప్పులు తప్పక తినండి!
32 ఏళ్ల తర్వాత ఆ ఊరుకు బస్సొచ్చింది.. ఫలించిన గ్రామస్తుల కల
32 ఏళ్ల తర్వాత ఆ ఊరుకు బస్సొచ్చింది.. ఫలించిన గ్రామస్తుల కల
ఆ సినిమా తర్వాత ఇల్లు , ఆస్తులు అమ్మేశా.. నిర్మాత ఎంఎస్ రాజు..
ఆ సినిమా తర్వాత ఇల్లు , ఆస్తులు అమ్మేశా.. నిర్మాత ఎంఎస్ రాజు..
రూల్‌ ఆఫ్‌ 72.. రూ.5 లక్షల పెట్టుబడి, రూ.10 లక్షల లాభం!
రూల్‌ ఆఫ్‌ 72.. రూ.5 లక్షల పెట్టుబడి, రూ.10 లక్షల లాభం!
శతమానం భవతి,వందేళ్ల వయసులోనూ నిండు నూరేళ్ల వేడుక జరుపుకున్న బామ్మ
శతమానం భవతి,వందేళ్ల వయసులోనూ నిండు నూరేళ్ల వేడుక జరుపుకున్న బామ్మ
శుభ వార్త చెప్పిన శోభా శెట్టి.. ప్రియుడితో కలిసి మొదటి అడుగు..
శుభ వార్త చెప్పిన శోభా శెట్టి.. ప్రియుడితో కలిసి మొదటి అడుగు..
అల్ఫపీడనం ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో వర్షాలు!
అల్ఫపీడనం ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో వర్షాలు!