Rishabh Pant: పంత్‌తో మాజీ క్రికెటర్లు.. రిషబ్‌ యోగక్షేమాలు తెలుసుకున్న రైనా, భజ్జీ, శ్రీశాంత్‌.. ఫొటోలు వైరల్‌

తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్లు పంత్‌ను పరామర్శించారు. సురేశ్‌రైనా, హర్భజన్‌ సింగ్, శ్రీశాంత్‌ రిషబ్‌ ఇంటి కెళ్లి అతని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కాసేపు అతనితో సరదాగా గడిపారు.

Rishabh Pant: పంత్‌తో మాజీ క్రికెటర్లు.. రిషబ్‌ యోగక్షేమాలు తెలుసుకున్న రైనా, భజ్జీ, శ్రీశాంత్‌.. ఫొటోలు వైరల్‌
Rishabh Pant
Follow us

|

Updated on: Mar 26, 2023 | 12:15 PM

గతేడాది చివరిలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ ప్రస్తుతం మెల్లిగా కోలుకుంటున్నాడు. కారు ప్రమాదానికి గురైన పంత్‌కు ఆ తర్వాత మోకాలికి సర్జరీ జరిగింది. దీని కారణంగా చాలా కాలం నుంచి క్రికెట్ఖు దూరంగా ఉంటున్నాడు పంత్. అతను క్రికెట్ బ్యాట్‌ పట్టడానికి చాలా సమయం పడుతుందని తెలుస్తుంది. కాగా తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన అప్డేట్స్‌ను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటున్నాడు రిషబ్‌. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్లు పంత్‌ను పరామర్శించారు. సురేశ్‌రైనా, హర్భజన్‌ సింగ్, శ్రీశాంత్‌ రిషబ్‌ ఇంటి కెళ్లి అతని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కాసేపు అతనితో సరదాగా గడిపారు. అనంతరం ఆక్షణాలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో కాలికి పట్టితో కనిపించాడు పంత్‌. అయితే చిరునవ్వులు చిందిస్తూ కనిపించడంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

‘పంత్‌ను నేను సోదరుడిగా భావిస్తున్నాను. ఇద్దరమూ ప్రేమనే నమ్ముతాం. అతను త్వరలోనే కోలుకుని మైదానంలోకి అడుగుడపెడతాడు’ అని శ్రీశాంత్‌ తను షేర్‌ చేసిన ఫొటోలకు క్యాప్షన్‌ ఇచ్చాడు. అలాగే ‘హృదయం ఉన్న చోట కుటుంబం ఉంటుంది. పంత్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని, త్వరలో ఈ ఆటగాడు మళ్లీ బ్యాటపడతాడని రైనా పేర్కొన్నాడు. పంత్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందని, మైదానంలో అడుగుపెట్టడానికి ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పడుతుందని భావిస్తున్నారు. దీంతో ఈ ఐపీఎల్ సీజన్‌కు పూర్తిగా దూరం కానున్నాడు పంత్‌. అలాగే ఈ ఏడాది చివర్లో జరగబోయే వన్డే వరల్డ్ కప్‌లో ఆడడం కూడా కష్టమే. మైదానంలోకి దిగకున్నా ఐపీఎల్‌ మ్యాచ్‌లను చూసేందుకు రిషబ్‌ వస్తాడని ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక