SRH: ఆ ముగ్గురే సన్‌రైజర్స్ టార్గెట్.. కోట్లు ఖర్చుపెడతానంటున్న కావ్య పాప.! వారెవరంటే?
క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఐపీఎల్ 2024 వేలంపైనే దృష్టి పెట్టారు. డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా ఈ మినీ వేలం జరగనుండగా.. ఇందుకోసం బీసీసీఐ ఏర్పాట్లు వేగంగా చేస్తోంది. ఇక 1166 మంది ప్లేయర్లు తమ పేర్లను వేలంలో రిజిస్టర్ చేసుకున్నారు. అలాగే ఇందులో నుంచి 77 మంది ప్లేయర్స్‌ను ఫ్రాంచైజీలు కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఐపీఎల్ 2024 వేలంపైనే దృష్టి పెట్టారు. డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా ఈ మినీ వేలం జరగనుండగా.. ఇందుకోసం బీసీసీఐ ఏర్పాట్లు వేగంగా చేస్తోంది. ఇక 1166 మంది ప్లేయర్లు తమ పేర్లను వేలంలో రిజిస్టర్ చేసుకున్నారు. అలాగే ఇందులో నుంచి 77 మంది ప్లేయర్స్‌ను ఫ్రాంచైజీలు కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. సన్‌రైజర్స్ జట్టు ఈసారి వేలంలో ముగ్గురు కీ ప్లేయర్స్‌ను కొనుగోలు చేయడమే టార్గెట్‌గా పెట్టుకుంది. ఒకవేళ అదే జరిగితే సన్‌రైజర్స్ హైదరాబాద్ పవరఫుల్ జట్టు కావడం పక్కా.
2023 ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన సన్‌రైజర్స్.. ఆ ఏడాది అత్యధిక డబ్బులతో కొనుగోలు చేసిన పలువురు ప్లేయర్స్‌ను విడిచిపెట్టింది. ఈ క్రమంలోనే జట్టులో 6 స్థానాలు మిగిలున్నాయి. ఇందులో విదేశీ ప్లేయర్స్ కోసం 3 స్థానాలు ఉండగా.. ఆ స్లాట్స్ కోసం ముగ్గురిపై టార్గెట్ పెట్టుకుంది కావ్య పాప, సన్‌రైజర్స్ యాజమాన్యం. కోట్లైనా సరే.. తగ్గేదేలే అంటూ కాసుల వర్షం కురిపించేందుకు హైదరాబాద్ సిద్దమైంది. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
1. రచిన్ రవీంద్ర:
వన్డే ప్రపంచకప్‌లో 3 శతకాలతో రెచ్చిపోయిన రచిన్ రవీంద్ర.. అటు బ్యాట్స్‌మెన్‌గా.. ఇటు బౌలర్‌గా రెండు బాధ్యతలు చేయగలడు. ఆల్‌రౌండర్ పాత్రకు సరిగ్గా సరిపోతాడు. దీంతో సన్‌రైజర్స్ రచిన్‌పై కన్నేసింది.
2. ట్రావిస్ హెడ్:
ట్రావిస్ హెడ్ విధ్వంసకర ఓపెనర్ మాత్రమే కాదు.. మ్యాచ్‌ను ఈజీగా మలుపు తిప్పగలడు. వరల్డ్‌కప్ ఫైనల్‌లో భారత్‌పై అద్భుత సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
3. హసరంగా:
శ్రీలంకన్ మిస్టరీ స్పిన్నర్ వానిండు హసరంగా కోసం కూడా సన్‌రైజర్స్ పోటీ పడుతోంది. జట్టుకు లెగ్ స్పిన్నర్ సమస్య ఉండటంతో.. కచ్చితంగా వేలంలో కాసులు కురిపించడం ఖాయం.
The #IPLAuction table awaits 👀⌛️ pic.twitter.com/3pVu3J77qH
— SunRisers Hyderabad (@SunRisers) November 28, 2023