IND vs AUS 3rd Test: మూడో టెస్ట్‌కు ముందు భారత్‌కు బిగ్ షాక్.. దూరం కానున్న మ్యాచ్ విన్నర్?
Sunil Gavaskar Key Comments on Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా పనిభార నిర్వహణపై సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ భారత ఫాస్ట్ బౌలర్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోని అన్ని మ్యాచ్‌లను ఆడాలంటూ, అందుకు గల కారణాలు కూడా చెప్పుకొచ్చాడు.

Indian Cricket Team: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ఈ రెండు మ్యాచ్‌ల తర్వాత రెండు జట్లూ ఒక్కో విజయంతో సరిసమానంగా ఉన్నాయి. తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. అడిలైడ్‌లో ఆతిథ్య జట్టు 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడో మ్యాచ్ డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్‌లో జరగనుంది. ఇదిలా ఉంటే, జస్ప్రీత్ బుమ్రా పనిభారం నిర్వహణపై భారత మాజీ వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ మొత్తాన్ని జస్ప్రీత్ బుమ్రా ఆడాలని సునీల్ గవాస్కర్ సూచించాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు బుమ్రా బంతితో భారత స్టార్‌గా మారాడు. పెర్త్‌లో విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఓటమి పాలైనప్పటికీ, పింక్ బాల్ టెస్టులో పేసర్ బుమ్రా 4 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు బుమ్రా 12 వికెట్లు తీశాడు. అడిలైడ్ టెస్టులో తిమ్మిర్లు కారణంగా బుమ్రా మైదానంలో పడిపోయాడు. దీంతో అతని ఫిట్‌నెస్ గురించి కొంత ఆందోళన నెలకొంది. అయితే, అతను మళ్లీ బౌలింగ్ కొనసాగించడం గమనార్హం.
బుమ్రా గాయపడి ఉంటే విషయం వేరేలా ఉండేదని గవాస్కర్ అన్నాడు. గవాస్కర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘అతను మొత్తం 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాలని నేను కోరుకుంటున్నాను. భారతదేశం కోసం ఆడుతున్నారు. పనిభారంతోపాటు మరెన్నో కారణాల ప్రశ్నలు లేవు. గాయం అయితే తప్ప అతను మొత్తం 5 టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ (అడిలైడ్ టెస్ట్) రెండున్నర రోజుల్లో ముగిసింది. ఇది 5 రోజులు కొనసాగలేదు. అందుకే వారికి 5 రోజుల విరామం లభిస్తుంది. అతనికి ఏదైనా సమస్య లేదా గాయం ఉంటే, అప్పుడు విశ్రాంత్రి ఇవ్వాలి అంటూ చెప్పుకొచ్చాడు.
బుమ్రా టీమిండియా కీలక ఆటగాడు..
భారత్‌కు బుమ్రా కీలక ఆటగాడు అని గవాస్కర్ పేర్కొన్నాడు. అతను అన్ని మ్యాచ్‌లు ఆడకపోతే మ్యాచ్‌లో 20 వికెట్లు తీయడానికి భారత జట్టుకు అవకాశాలు తగ్గుతాయని చెప్పాడు. గవాస్కర్ మాట్లాడుతూ, ‘అతను భారత ప్రధాన ఆటగాడు. అతనిని మొత్తం 5 మ్యాచ్‌ల్లో ఆడలేకపోతే 20 ఆస్ట్రేలియన్ వికెట్లు తీసే అవకాశాలను తగ్గించుకుంటారు. బుమ్రాను ఎలా ఉపయోగించాలో కెప్టెన్‌పై ఆధారపడి ఉంటుంది. బౌలింగ్‌కి వచ్చినప్పుడల్లా ప్రభావవంతంగా ఉండేలా వాడుకోవాలి అంటూ సూచించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








