IPL 2025: ఐపీఎల్‌ అన్‌సోల్డ్ ప్లేయర్లపై కన్నేసిన పాకిస్తాన్.. పీఎస్‌ఎల్‌ 2025లో బంఫర్ ఆఫర్స్

PSL 2025: "ప్లేయర్ డ్రాఫ్ట్‌ను లండన్ లేదా దుబాయ్‌లో ఉంచడానికి ఫ్రాంచైజీ యజమానులు అనుకూలంగా ఉన్నారు. ఎందుకంటే ఇది లీగ్ బ్రాండ్ ఇమేజ్‌ను మెరుగుపరుస్తుందని వారు భావిస్తున్నారు" అని వార్తలు వినిపిస్తున్నాయి.

IPL 2025: ఐపీఎల్‌ అన్‌సోల్డ్ ప్లేయర్లపై కన్నేసిన పాకిస్తాన్.. పీఎస్‌ఎల్‌ 2025లో బంఫర్ ఆఫర్స్
Psl Vs Ipl
Follow us
Venkata Chari

|

Updated on: Dec 09, 2024 | 1:55 PM

IPL 2025: ప్రపంచ క్రికెట్‌లో అతిపెద్ద టీ20 లీగ్ అయిన ఐపీఎల్.. ఇటీవల మెగా వేలం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో చాలా మంది ఆటగాళ్లు లక్షాధికారులుగా మారారు. ఈ మెగా టీ20 లీగ్ వచ్చే ఏడాది సీజన్ కోసం దేశం, ప్రపంచం నలుమూలల నుంచి వందలాది మంది ఆటగాళ్లు అమ్ముడయ్యారు. అయితే ఈ వేలంలో చాలా మంది కీలక ఆటగాళ్లు అమ్ముడుపోలేదు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన ఆటగాళ్లపై మన పొరుగు దేశం పాకిస్థాన్ కన్నేసింది.

అవును.. ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేని స్టార్ ప్లేయర్లను పీఎస్‌ఎల్‌లో భాగం చేయాలని చూస్తోంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీలు ఆ ఆటగాళ్లపై పూర్తి ఆసక్తి చూపుతున్నాయి. భారతదేశంలో జరగనున్న మెగా టి 20 లీగ్ వేలంలో అమ్ముడుపోని విదేశీ స్టార్ ఆటగాళ్లు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో తమ ప్రతిభను కనబరిచేందుకు సిద్ధమయ్యారు.

ఐపీఎల్‌లో అమ్ముడుపోని ఆటగాళ్లపై పీఎస్‌ఎల్ ఫ్రాంచైజీలు..

నివేదికల మేరకు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం సమయంలో కొనుగోలుదారులను కనుగొనలేకపోయిన ఆటగాళ్లు, పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీలు వారిని డ్రాఫ్ట్‌లో చేర్చాలని కోరుతున్నాయి. దీంతో వీరంతా పీఎస్‌ఎల్ 2025లో ఆడబోతున్నారు. గత నెలలో, ఐపీఎల్ 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరిగింది. ఈ వేలంలో జానీ బెయిర్‌స్టో, కేన్ విలియమ్సన్, స్టీవెన్ స్మిత్, డేవిడ్ వార్నర్, కేశవ్ మహరాజ్, అలెక్స్ కారీ, అకిల్ హుస్సేన్ వంటి చాలా మంది స్టార్లు అమ్ముడుపోలేదు.

ఇవి కూడా చదవండి

మరో కీలక వార్త ఏమిటంటే, వచ్చే ఏడాది జరిగే పీఎస్‌ఎల్ టోర్నమెంట్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డ్రాఫ్ట్‌ను విదేశాల్లో నిర్వహించవచ్చు అని తెలుస్తోంది. విదేశాల్లో జరిగే ఐపీఎల్ వేలం స్ఫూర్తితో వచ్చే ఏడాది ముసాయిదా ప్రక్రియను దుబాయ్ లేదా లండన్‌లో నిర్వహించవచ్చు అని ఓ ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఛాంపియన్స్ ట్రోఫీ వేడుకలకు రోహిత్ శర్మ హాజరు కాడం లేదా..?
ఛాంపియన్స్ ట్రోఫీ వేడుకలకు రోహిత్ శర్మ హాజరు కాడం లేదా..?
శ్రీ చైతన్య కాలేజీ నిర్వాకం.. ఫీజు కట్టలేదని విద్యార్థి గెంటివేత!
శ్రీ చైతన్య కాలేజీ నిర్వాకం.. ఫీజు కట్టలేదని విద్యార్థి గెంటివేత!
తెల్లారుజామున అదే పనిగా కుక్కల అరుపులు.. ఏంటా అని చూడగా
తెల్లారుజామున అదే పనిగా కుక్కల అరుపులు.. ఏంటా అని చూడగా
IPL 2025 లో ఆర్సీబీ ఆశలన్ని ఆ ముగ్గురిపైనే..!
IPL 2025 లో ఆర్సీబీ ఆశలన్ని ఆ ముగ్గురిపైనే..!
రుద్రాణి చేతికి బ్రహ్మాస్త్రం.. రాజ్ చెంప పగలకొట్టిన అపర్ణ..
రుద్రాణి చేతికి బ్రహ్మాస్త్రం.. రాజ్ చెంప పగలకొట్టిన అపర్ణ..
వెంకటేష్‌తో ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
వెంకటేష్‌తో ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
'అమ్మానాన్నలు కాబోతున్నామోచ్‌'.. శుభవార్త చెప్పిన కిరణ్ అబ్బవరం
'అమ్మానాన్నలు కాబోతున్నామోచ్‌'.. శుభవార్త చెప్పిన కిరణ్ అబ్బవరం
చికెన్ కొట్టేలోపు బైక్ మాయం.. ఉదయాన్నే షాప్ ఓపెన్ చేస్తుండగా..
చికెన్ కొట్టేలోపు బైక్ మాయం.. ఉదయాన్నే షాప్ ఓపెన్ చేస్తుండగా..
సైఫ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు రివార్డు.. ఎంతంటే?
సైఫ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు రివార్డు.. ఎంతంటే?
స్టార్ హీరోలతో చేసింది.. ఇప్పుడు ఆఫర్స్ రాక ఇలా..
స్టార్ హీరోలతో చేసింది.. ఇప్పుడు ఆఫర్స్ రాక ఇలా..