IPL 2022 Auction: ధోని టీమ్‌మేట్స్‌పై ఫ్రాంచైజీలు చూపని ఆసక్తి.. వారెవరో తెలుసా.?

ఐపీఎల్ 2022 మెగా వేలంలో చిన్న తలా సురేష్ రైనాకు నిరాశే దక్కింది. ఏ ఫ్రాంచైజీ కూడా అతడ్ని కొనుగోలు చేసేందుకు..

IPL 2022 Auction: ధోని టీమ్‌మేట్స్‌పై ఫ్రాంచైజీలు చూపని ఆసక్తి.. వారెవరో తెలుసా.?
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 12, 2022 | 11:24 PM

ఐపీఎల్ 2022 మెగా వేలంలో చిన్న తలా సురేష్ రైనాకు నిరాశే దక్కింది. ఏ ఫ్రాంచైజీ కూడా అతడ్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. దీనితో ఈ బిడ్‌లో సురేష్ రైనా అన్‌సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిపోయాడు. అటు స్టీవ్ స్మిత్‌కు కూడా ఇదే పరిస్థితి. వీరిద్దరూ ఐపీఎల్‌లో ధోనితో కలిసి ఆడిన సంగతి తెలిసిందే. చెన్నై జట్టులో ధోనితో పాటు రైనా కూడా కీలక ప్లేయర్ కాగా.. పూణే సూపర్ జెయింట్స్ జట్టులో ధోని, స్మిత్ కలిసి ఆడారు.

ఈ వేలంలో మొదటి ప్లేయర్‌గా శిఖర్ ధావన్ రూ. 8.25 కోట్లకు పంజాబ్ కింగ్స్‌కు అమ్ముడుపోగా.. రెండో ప్లేయర్‌గా అశ్విన్ రూ. 5 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. మూడో ప్లేయర్‌గా ప్యాట్ కమ్మిన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రూ. 7.25 కోట్లకు, నాలుగో ప్లేయర్‌గా కసిగో రబాడ పంజాబ్ కింగ్స్‌కు రూ. 9.25 కోట్లకు అమ్ముడుపోయారు. ఇక ఆ తర్వాత ట్రెంట్ బౌల్ట్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.8 కోట్లకు దక్కించుకుంది. శ్రేయాస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్‌ రూ. 12.25 కోట్లకు దక్కించుకుంది. రూ. 6.25 కోట్లకు మహమ్మద్ షమీని గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాఫ్ డుప్లెసిస్‌ను ఫ్రాంచైజీ రూ. 7 కోట్లకు కొనుగోలు చేసింది. లక్నో టీం డికాక్‌ను రూ.6.75 కోట్లతో దక్కించుకుంది. డేవిడ్ వార్నర్‌ను రూ. 6.25 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. ఇక మనీష్ పాండే రూ. 4.60 కోట్లకు లక్నో జెయింట్స్, హెట్‌మెయిర్ రూ.8.50 కోట్లకు రాజస్తాన్ రాయల్స్, ఊతప్పను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 2 కోట్లకు, గుజరాత్ టైటాన్స్ జాసన్ రాయ్‌ను రూ. 2 కోట్లకు దక్కించుకుంది. పడిక్కల్‌ను రూ. 7.75 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. స్టీవ్ స్మిత్ కూడా అన్‌సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిపోయాడు.

కాగా, ఐపీఎల్ మెగా వేలం బెంగళూరులో జరుగుతోంది. క్రికెట్ ప్రపంచం ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఈ ఆక్షన్‌లో పలు సంచలనాలు నమోదవుతున్నాయి. నాలుగేళ్ల విరామం తరువాత భారీ సంఖ్యలో జరుగుతున్న ఈ మెగా వేలంలో 590 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రెండు రోజులు వేలం జరుగుతుంది.

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో