Ishan Kishan: చిచ్చరపిడుగు.. ఇచ్చిపడేశాడు.. డబుల్ సెంచరీ ఒక్కటే కాదు.. బోలెడు రికార్డులు బద్దలు

చిచ్చరపిడుగు చెలరేగిపోయాడు. బంగ్లా బౌలర్లను ఊచకోత కోశాడు. మ్యాచ్‌లో 131 బంతులు ఎదుర్కొన్న కిషన్‌ 23 ఫోర్లు, 10 సిక్స్‌లతో 210 రన్స్ చేశాడు.

Ishan Kishan: చిచ్చరపిడుగు.. ఇచ్చిపడేశాడు.. డబుల్ సెంచరీ ఒక్కటే కాదు.. బోలెడు రికార్డులు బద్దలు
Ishan Kishan
Follow us

|

Updated on: Dec 10, 2022 | 4:21 PM

ఇషాన్ కా.. షాన్ దార్ ఇన్నింగ్స్.. బంగ్లా బౌలర్లను వణికించిన బ్యాటింగ్ ఇది. బంగ్లాతో మూడో వన్డేలో డబుల్ సెంచరీతో ఇషాన్ కిషన్ ఇరగదీశాడు. ఒక్కో బౌలర్‌ను ఊచకోత కోశాడు. 23 ఫోర్లు, 9 సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బెంచ్ మీద కూర్చోబెడుతున్నారనే కసి.. రాక రాక వచ్చిన అవకాశంలో అదరగొట్టాలనే పట్టుదలో తెలీదు కానీ.. బంతిని కసితో బాదాడు. 85 బంతుల్లో వన్డేల్లో తొలి సెంచరీ బాదిన ఇషాన్ కిషన్.. ఆ తర్వాత కేవలం 41 బంతుల్లోనే సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 9 సిక్సర్లు బాదిన ఇషాన్ కిషన్, బంగ్లాపై అత్యధిక సిక్సులు బాదిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ 2000వ సంవత్సరంలో 7 సిక్సర్లు బాదాడు. వన్డేల్లో తొలి సెంచరీ చేస్తూ అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు ఇషాన్ కిషన్.

డబుల్‌ సెంచరీ బాదిన నాల్గో భారత క్రికెటర్‌..ప్రపంచంలో ఏడో బ్యాట్స్‌మెన్‌గా ఇషాన్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ప్రపంచంలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ కూడా ఇదే. గేల్ 138 బంతుల్లో డబుల్ కొడితే.. ఇషాన్ కేవలం 126 బంతులకే బాదేశాడు. ఆభిమానులకు కిక్కి్చ్చే ఇన్నింగ్స్ ఆడాడు. 103 బంతుల్లో 150 స్కోర్ చేసిన ఇషాన్ కిషన్, అత్యంత వేగంగా 150+ బాదిన భారత బ్యాటర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకుముందు వీరేంద్ర సెహ్వాగ్ 112 బంతుల్లో 150+ స్కోరు నమోదు చేశాడు.

వన్డేల్లో టీమిండియా తరుపున అత్యధిక స్కోరు నమోదు చేసిన వికెట్ కీపర్ కూడా ఇషాన్ కిషనే. బంగ్లాపై ఇషాన్ కిషన్‌దే అత్యధిక స్కోరు. ఇంతకుముందు 2011లో షేన్ వాట్సన్ 185 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ రికార్డును తుడిచి పెట్టేశాడు ఇషాన్ కిషన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..