AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH vs DC: వర్షం ఎఫెక్ట్.. ప్లే ఆఫ్స్ నుంచి హైదరాబాద్ ఔట్.. ఢిల్లీ పరిస్థితి ఏంటంటే?

IPL Playoffs: హైదరాబాద్ (SRH vs డిసి) గెలవాలంటే 20 ఓవర్లలో 134 పరుగులు చేయాల్సి ఉంది. కానీ, అకస్మాత్తుగా వర్షం పడటం వల్ల మ్యాచ్ రద్దు కావడమే కాకుండా కమిన్స్ సేన ప్లేఆఫ్ రేసు నుండి పూర్తిగా నిష్క్రమించేలా చేసింది. నిజానికి, ప్లేఆఫ్స్‌లో నిలవాలంటే హైదరాబాద్ ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. కానీ, ఇప్పుడు ఆ జట్టు కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. అన్నీ గెలిచినా ఖాతాలో13 పాయింట్లను మాత్రమే ఉంటాయి.

SRH vs DC: వర్షం ఎఫెక్ట్.. ప్లే ఆఫ్స్ నుంచి హైదరాబాద్ ఔట్.. ఢిల్లీ పరిస్థితి ఏంటంటే?
Srh Vs Dc Match
Venkata Chari
|

Updated on: May 06, 2025 | 6:31 AM

Share

SRH vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా 55వ మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దు చేశారు. మ్యాచ్ రద్దు అయిన తర్వాత, రెండు జట్ల మధ్య ఒక పాయింట్ సమానంగా పంపిణీ చేశారు. దీని కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు ప్లేఆఫ్ రేసు నుంచి పూర్తిగా నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో, హైదరాబాద్ (SRH vs DC) కెప్టెన్ పాట్ కమ్మిన్స్ టాస్ గెలిచి ఢిల్లీని ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ క్రమంలో ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క బంతి కూడా పడలేదు. మ్యాచ్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 13 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉంది.

నిరాశ పరిచిన డీసీ బ్యాట్స్‌మెన్స్..

ఐపీఎల్ 55వ మ్యాచ్‌లో, హైదరాబాద్ (SRH vs DC) కెప్టెన్ పాట్ కమ్మిన్స్ టాస్ గెలిచి, పర్యాటక జట్టును ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇన్నింగ్స్ ప్రారంభించిన కరుణ్ నాయర్ (0) పాట్ కమ్మిన్స్ ఇన్నింగ్స్ తొలి బంతికే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ కమ్మిన్స్ డేంజరస్ ప్లేయర్ ఫాఫ్ డు ప్లెసిస్‌ను 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ చేశాడు. అదే సమయంలో, అభిషేక్ పోరెల్ కూడా 8 వ్యక్తిగత స్కోరు వద్ద కమ్మిన్స్ బాధితుడిగా మారాడు.

ప్రత్యేకత ఏమిటంటే ఢిల్లీ టాప్ ఆర్డర్‌ను నాశనం చేసే పనిని హైదరాబాద్ (SRH vs DC) కెప్టెన్ కమిన్స్ చేపట్టాడు. అతనికి వికెట్ వెనుక నిలబడి ఇషాన్ కిషన్ మద్దతు ఇచ్చాడు. ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ వికెట్ల వెనకాలే దొరికారు. వరుసగా మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ తెలివిగా బ్యాటింగ్ చేస్తుందని భావించారు. కానీ, మొదట కెప్టెన్ అక్షర్ పటేల్ 6 పరుగులు చేసి ఔటయ్యాడు. తరువాత కేఎల్ రాహుల్ కూడా 10 పరుగులు చేసి పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు. ఒక దశలో ఢిల్లీ (SRH vs DC) 5 వికెట్లకు 29 పరుగులకు పడిపోయింది.

ఇవి కూడా చదవండి

స్టబ్స్-శర్మ అద్భుత ఇన్నింగ్స్..

మిడిల్ ఆర్డర్ విఫలమైన తర్వాత, అశుతోష్ శర్మతో కలిసి ట్రిస్టన్ స్టబ్స్ ఇన్నింగ్స్ బాధ్యతను స్వీకరించాడు. ట్రిస్టన్ స్టబ్స్ 36 బంతుల్లో అజేయంగా 41 పరుగులు చేయగా, అశుతోష్ శర్మ 26 బంతుల్లో 41 పరుగులు చేసి ఢిల్లీని 20 ఓవర్లలో 133 పరుగులకు చేర్చారు. మరోవైపు, హైదరాబాద్ (SRH vs DC) కెప్టెన్ పాట్ కమ్మిన్స్ 4 ఓవర్లలో కేవలం 19 పరుగులకు 3 వికెట్లు పడగొట్టగా, జయదేవ్ ఉనద్కట్ 4 ఓవర్లలో 13 పరుగులకు ఒక బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేశాడు. హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 36 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఇషాన్ మలింగ 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టాడు. జీషన్ అన్సారీ 3 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చాడు. ఈ కాలంలో అతనికి ఒక్క వికెట్ కూడా పడలేదు.

ప్లేఆఫ్ రేసు నుంచి హైదరాబాద్ ఔట్..

ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత, హైదరాబాద్ (SRH vs డిసి) గెలవాలంటే 20 ఓవర్లలో 134 పరుగులు చేయాల్సి ఉంది. కానీ, అకస్మాత్తుగా వర్షం పడటం వల్ల మ్యాచ్ రద్దు కావడమే కాకుండా కమిన్స్ సేన ప్లేఆఫ్ రేసు నుండి పూర్తిగా నిష్క్రమించేలా చేసింది. నిజానికి, ప్లేఆఫ్స్‌లో నిలవాలంటే హైదరాబాద్ ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. కానీ, ఇప్పుడు ఆ జట్టు కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. అన్నీ గెలిచినా ఖాతాలో13 పాయింట్లను మాత్రమే ఉంటాయి. మరోవైపు, DC (SRH vs DC) ఇంకా 13 పాయింట్లతో ప్లేఆఫ్ రేసులో ఉంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..