CSK vs SRH: చెన్నై ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌ మ్యాచ్ నుంచి ధోనీ ఔట్.. సారథిగా ఎవరంటే?

CSK vs SRH Probable Playing XI: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈరోజు రాత్రి (ఏప్రిల్ 21) IPLలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ చెన్నై సొంత మైదానం 'ఎంఏ చిదంబరం స్టేడియం, చెపాక్‌'లో జరగనుంది.

CSK vs SRH: చెన్నై ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌ మ్యాచ్ నుంచి ధోనీ ఔట్.. సారథిగా ఎవరంటే?
Dhoni
Follow us
Venkata Chari

|

Updated on: Apr 21, 2023 | 3:43 PM

CSK vs SRH Probable Playing XI: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈరోజు రాత్రి (ఏప్రిల్ 21) IPLలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ చెన్నై సొంత మైదానం ‘ఎంఏ చిదంబరం స్టేడియం, చెపాక్‌’లో జరగనుంది. ఈ మైదానం ఎప్పుడూ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటోంది. ఇటువంటి పరిస్థితిలో ఇక్కడ రెండు జట్లూ తమ మునుపటి ప్లేయింగ్-11లో మార్పులు చేసి అదనపు స్పిన్నర్లకు చోటు ఇవ్వాలని కోరుకుంటుంన్నాయి.

కివీ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ చెన్నై జట్టులోకి తిరిగి రావచ్చని తెలుస్తోంది. సన్‌రైజర్స్ జట్టు తమ ఇంగ్లండ్ స్పిన్ బౌలర్ ఆదిల్ రషీద్‌ను రంగంలోకి దించవచ్చు. అంటే, రెండు జట్లు తమ చివరి ఆడుతున్న ప్లేయింగ్ 11 నుంచి ఒక విదేశీ ఫాస్ట్ బౌలర్‌కు బదులుగా ఒక విదేశీ స్పిన్నర్‌కు అవకాశం ఇవ్వవచ్చు.

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఎంఎస్ ధోనీకి విశ్రాంతి ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో ధోని ప్లేస్‌లో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించవచ్చని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

రెండు జట్లలో ఆడే ప్రాబబుల్ ప్లేయింగ్ 11..

చెన్నై టీం (మొదట బ్యాటింగ్): డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, MS ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), తుషార్ దేశ్‌పాండ్, మహిష్ తీక్ష్ణ, మిచెల్ సంత్నర్.

మొదట బౌలింగ్ చేస్తే చెన్నై జట్టు: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, MS ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), ఆకాష్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, మహిష్ తిక్ష్ణ, మిచెల్ సాంట్నర్.

హైదరాబాద్ టీం (మొదటి బ్యాటింగ్): హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఆదిల్ రషీద్, మయాంక్ మార్కండే.

మొదట బౌలింగ్ చేస్తే హైదరాబాద్ టీం: హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఆదిల్ రషీద్, మయాంక్ మార్కండే, టి నటరాజన్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..