SRH Retention List: షమీని పంపిన కావ్యపాప.. మరోసారి వారినే నమ్ముకున్న ఎస్‌ఆర్‌హెచ్
Sunrisers Hyderabad Retained and Released Players Full List: 2016 ఛాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం.. 2024 రన్నరప్‌గా నిలిచింది. అయితే, 2025లో కోల్పోయిన వైభవాన్ని 2026లో తిరిగి పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2024లో డేంజరస్ బ్యాటింగ్‌తో దడదడలాడించిన హైదరాబాద్ జట్టు ప్రతీ మ్యాచ్‌నూ కొత్త శిఖరాలకు చేర్చింది.

Sunrisers Hyderabad Retained and Released Players Full List: 2016 ఛాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం.. 2024 రన్నరప్‌గా నిలిచింది. అయితే, 2025లో కోల్పోయిన వైభవాన్ని 2026లో తిరిగి పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2024లో డేంజరస్ బ్యాటింగ్‌తో దడదడలాడించిన హైదరాబాద్ జట్టు ప్రతీ మ్యాచ్‌నూ కొత్త శిఖరాలకు చేర్చింది. పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని జట్టు గత సీజన్‌లో దారుణమైన ప్రదర్శనతో ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది.
SRH ఆడిన 14 ఆటల్లో కేవలం ఆరు మాత్రమే గెలిచి పట్టికలో ఆరవ స్థానంలో నిలిచింది. మొదటి 10 ఆటల్లో కేవలం మూడు విజయాలతో పూర్తిగా తేలిపోయింది. అయితే, ఆ తర్వాత నాలుగు మ్యాచ్‌లలో మూడు విజయాలతో తిరిగి వచ్చినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 2025 సీజన్‌లో తమ చివరి మ్యాచ్‌లో, హైదరాబాద్ జట్టు 278 పరుగులు చేసి 110 పరుగుల తేడాతో గెలిచి తమ సామర్థ్యాన్ని చూపించింది. 2026 లో కూడా తమ బ్యాటర్స్ ఫామ్‌లో ఉంటారని, బ్యాట్‌తోనే ప్రత్యర్థులను ఓడించగలమని SRH ఆశిస్తోంది.

SRH అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితా : పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, ఆర్. స్మరన్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కమిందు మెండిస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్సే, జయదేవ్ ఉనద్కత్, జిషాన్ అన్ద్కత్, జిషాన్ మలింగస్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్ల ట్రేడ్: మహమ్మద్ షమీ (రూ. 10 కోట్లు) లక్నో సూపర్ జెయింట్స్ కు ట్రేడ్ అయ్యాడు. మహ్మద్ షమీ, సచిన్ బేబీ, అభినవ్ మనోహర్, అథర్వ తైడే, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, వియాన్ ముల్డర్, సిమర్జీత్ సింగ్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ విడుదల చేసిన ఆటగాళ్లు: మహ్మద్ షమీ, ఆడమ్ జంపా, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్, అభినవ్ మనోహర్, అథర్వ తైదే, సచిన్ బేబీ.
IPL 2026 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మిగిలి ఉన్న బ్యాలెన్స్ : రూ. 25.5 కోట్లు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








