AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB Retention List: కోర్‌ టీంకే ఓటేసిన డిపెండింగ్ ఛాంపియన్.. మార్పులు ఏంటంటే?

Royal Challengers Bengaluru Retained and Released Players Full List: ఎట్టకేలకు తమ ట్రోఫీ నిరీక్షణకు తెరదించి, ఐపీఎల్ 2025 టైటిల్‌ను గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB).. డిఫెండింగ్ ఛాంపియన్‌లుగా ఐపీఎల్ 2026లోకి అడుగుపెడుతోంది. కెప్టెన్ రజత్ పటీదార్ నాయకత్వంలో కొత్త ఆత్మవిశ్వాసంతో, బలమైన కోర్‌ టీంతో కనిపించనుంది.

RCB Retention List: కోర్‌ టీంకే ఓటేసిన డిపెండింగ్ ఛాంపియన్.. మార్పులు ఏంటంటే?
Rcb 2026
Venkata Chari
|

Updated on: Nov 15, 2025 | 5:49 PM

Share

Royal Challengers Bengaluru Retained and Released Players Full List: ఎట్టకేలకు తమ ట్రోఫీ నిరీక్షణకు తెరదించి, ఐపీఎల్ 2025 టైటిల్‌ను గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB).. డిఫెండింగ్ ఛాంపియన్‌లుగా ఐపీఎల్ 2026లోకి అడుగుపెడుతోంది. కెప్టెన్ రజత్ పటీదార్ నాయకత్వంలో కొత్త ఆత్మవిశ్వాసంతో, బలమైన కోర్‌ టీంతో కనిపించనుంది. ఫ్రాంఛైజీ యాజమాన్యం జట్టులో భారీ మార్పులకు బదులు స్థిరత్వానికే ప్రాధాన్యత ఇచ్చింది. గెలిచిన తమ కలయికపై నమ్మకం ఉంచినప్పటికీ, రాబోయే ఐపీఎల్ 2026 మినీ-వేలం కోసం జట్టును కొత్తగా తీర్చిదిద్దేందుకు అధిక ధర పలికిన, సరిగా రాణించని కొద్దిమంది ఆటగాళ్లను విడుదల చేసింది.

బెంగళూరు జట్టు గత సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. 2026లో కూడా అదే పునరావృతం చేయాలని కోరుకుంటోంది. జట్టు దాదాపు అందరు స్టార్ ఆటగాళ్లను నిలుపుకుంది. లక్షలాది మంది RCB అభిమానుల హీరోగా మారిన తర్వాత రజత్ పాటిదార్ మరోసారి జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. విరాట్ కోహ్లీ కూడా అలాగే ఉన్నాడు.

Rcb

ఇవి కూడా చదవండి

RCB అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితా : రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జాకబ్ బెథెల్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషార, రసిఖ్ సలాం దార్, అభినందన్ సింగ్, సుయా శర్మా సింగ్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విడుదల చేసిన ఆటగాళ్లు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్వస్తిక్ చికారా, మయాంక్ అగర్వాల్, టిమ్ సీఫెర్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, మనోజ్ భాండాగే, లుంగి ఎన్‌గిడి, బ్లెస్సింగ్ ముజారబానీ, మోహిత్ రాఠీలను విడుదల చేసింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మిగిలిన స్లాట్‌లు:

IPL 2026 వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మిగిలి ఉన్న బ్యాలెన్స్ :

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..