SRH IPL 2023 Auction: యంగ్ ప్లేయర్లకు తోడైన సూపర్ సీనియర్లు.. హైదరాబాద్ పూర్తి జాబితా ఇదే..
Sunrisers Hyderabad Auction Players List :
Sunrisers Hyderabad Auction Players List : సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2023లో హ్యారీ బ్రూక్‌తో తమ వేలాన్ని ప్రారంభించింది. బ్రూక్ కోసం రూ.13.25 కోట్లు వెచ్చించింది. ఆ తర్వాత హైదరాబాద్ మయాంక్ అగర్వాల్‌ను రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2022 హైదరాబాద్‌కు అంతగా కలిసిరాలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 మ్యాచ్‌ల్లో 8 ఓడిపోయి 6 విజయాలు మాత్రమే సాధించింది. ఈ జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. ఈ జట్టు IPL 2023 కోసం ఒక బలమైన జట్టును తయారు చేసుకుంది. మరి వచ్చే ఏడాది ఎలా రాణిస్తుందో చూడాలి.
IPL మినీ వేలానికి ముందు, సన్‌రైజర్స్ హైదరాబాద్ కఠినమైన నిర్ణయాలు తీసుకొని 13 మంది ఆటగాళ్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కెప్టెన్ కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్ ఈ ఆటగాళ్లలో పెద్ద పేర్లుగా నిలిచాయి. మరోవైపు అభిషేక్ శర్మ, ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్ వంటి ఆటగాళ్లపై విశ్వాసం వ్యక్తం చేస్తూనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును అట్టిపెట్టుకుంది.
వేలంలో కొన్న ప్లేయర్లు.. హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్, ఆదిల్ రషీద్, మయాంక్ మార్కండే, వివ్రాంత్ శర్మ, సమర్థ్ వ్యాస్, సన్వీర్ సింగ్, ఉపేంద్ర యాదవ్, మయాంక్ దాగర్, అకేల్ హోసేన్, అన్మోల్ ప్రీత్ సింగ్, నితీష్ రెడ్డి
రిటైన్ ప్లేయర్లు.. అబ్దుల్ సమద్, ఐడెన్ మార్క్రామ్, ఫజ్లక్ ఫారూఖీ, కార్తీక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సన్, వాషింగ్టన్ సుందర్.
SRH విడుదల చేసిన ప్లేయర్లు.. కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, సీన్ అబాట్, శశాంక్ సింగ్, జగదీష్ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫుల్ స్క్వాడ్: హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్, ఆదిల్ రషీద్, మయాంక్ మార్కండే, వివ్రాంత్ శర్మ, సమర్థ్ వ్యాస్, సన్వీర్ సింగ్, ఉపేంద్ర యాదవ్, మయాంక్ దాగర్, అకేల్ హోసేన్, అన్మోల్ ప్రీత్ సింగ్, నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, ఐడెన్ మార్క్రామ్, ఫజ్లక్ ఫారూఖీ, కార్తీక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సన్, వాషింగ్టన్ సుందర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..